ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగోన్నతులు చేపట్టకుండా సర్దుబాటు అంగీకరించం

ABN, First Publish Date - 2021-02-02T04:12:27+05:30

ఉపాధ్యాయ పదోన్నతులు చేపడతారని ఎదురుచూస్తున్న తరుణంలో పదోన్నతులు చేపట్టకుండా ఉన్నత పాఠశాలల్లోకి ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడాన్ని తాము అంగీకరించమని పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌ రంగారావు, జిల్లాఅసోసియేట్‌ అధ్యక్షుడు ఆర్‌ బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మారెడ్డి

మధిర ఫ్రిబవరి 1: ఉపాధ్యాయ పదోన్నతులు చేపడతారని ఎదురుచూస్తున్న తరుణంలో పదోన్నతులు చేపట్టకుండా ఉన్నత పాఠశాలల్లోకి ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడాన్ని తాము అంగీకరించమని పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి  ఆర్‌ రంగారావు, జిల్లాఅసోసియేట్‌ అధ్యక్షుడు ఆర్‌ బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యాశాఖ చేపట్టిన ఈ సర్దుబాటు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉపాద్యాయులు సర్దుబాటును తిరస్కరించాల్సిందిగా పిలుపునిచ్చారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాద్యాయులను సర్దు బాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దీన్ని అంగీకరించేది లేదని అధికారులకు తమ సంఘం స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. పదోన్నతులు పూర్తయినట్లైతే అన్ని సబ్జెక్టుల్లో ఉపాద్యాయులు ఉండేవారన్నారు. ఇప్పటికైనా తక్షణమే పదోన్నతులు చేపట్టాలని  డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు కొమ్ము శ్రీనివాసరావు, పిల్లి నర్సింహారావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-02T04:12:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising