ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక తోలకాలు నిబంధనలకు తిలోదకాలు

ABN, First Publish Date - 2021-10-13T04:47:21+05:30

భద్రాచలం గోదావరిలో ఇసుక దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇక్కడి నుంచి ఖమ్మం జిల్లాలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం జారీ చేసిన రవాణా పత్రంతో ఇష్టానుసారంగా తోలకాలు జరుగుతున్నాయి.

ఇసుకను రవాణా చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2020 కూపన్‌ 2021లో తేదీలు మార్చి వాడకం

ఒక్కరోజులోనే భారీగా ఇసుక రవాణా

పట్టించుకుకోని రెవెన్యూ అధికారులు

అక్రమ వ్యాపారం నిజమే: తహసీల్దార్‌

భద్రాచలం అక్టోబరు 12: భద్రాచలం గోదావరిలో ఇసుక దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇక్కడి నుంచి ఖమ్మం జిల్లాలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం జారీ చేసిన రవాణా పత్రంతో ఇష్టానుసారంగా తోలకాలు జరుగుతున్నాయి. వాస్తవానికి 2020 జూలై1న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి జారీ చేసిన రవాణాపత్రంతో మంగళవారం ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో ప్రభుత్వ పనులు మందకొడిగా సాగుతున్నాయి. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఆగిపోయి చాలాకాలమైంది. ప్రభుత్వ పనుల పేరుతో విచ్చలవిడిగా అధిక సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను తరలించటం పట్ల ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. 2020 జూలై 1న ఖమ్మం జిల్లాలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి భద్రాచలం గోదావరి నుంచి ఇసుకను తరలించేందుకు జారీ చేసిన రవాణా పత్రం పై 2021 అక్టోబరు 12 తేదీతో మార్పులు చేయడం అనుమానాలకు తావిస్తోంది. పట్టణంలో ఇసుకను అక్రమంగా రవాణా చేసి రూ.4000 నుంచి రూ,4,500 వరకు విక్రయించినట్లు ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఇసుక రవాణాలో అవకతవకలు జరుగుతున్నాయనే విషయం అధికారు ల దృష్టికి వెళ్లినా వారు సత్వరం స్పందించకపోవటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై భద్రాచలం తహసీల్దార్‌ శ్రీనివాసయాదవ్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా గోదావరి వరదల ముందు జారీ చేసిన రవాణా పత్రానికి తాము మంగళవారం మార్పులు చేసి అందజేశామన్నారు. కాగా 2020 సంవత్సరానికి చెందిన రవాణాపత్రంతో 2021 అక్టోబరు12న తాజాగా మార్పులు చేస్తూ రవాణా ప్రతం జారీ చేయడాన్ని ప్రశ్నించగా అందులో ఈ ఏడాదిదే రవాణా పత్రం అంటూ సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా భద్రాద్రిలో ఇసుక అ క్రమ రవాణా జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


Updated Date - 2021-10-13T04:47:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising