ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వనదేవతల జాతరకు సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2021-01-25T04:26:18+05:30

మండల పరిధిలోని రంగాపురం రహదారి పక్కన గుట్టపై కొలువు తీరిన సమ్మక్క, సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది.

సమ్మక్క సారలమ్మ గుడివద్ద ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపటి నుంచి సమ్మక్కసారలమ్మ పండుగ

మూడు రోజులపాటు నిర్వహణ

రంగాపురం గుట్ట వద్ద సందడే సందడి

కరకగూడెం, జనవరి 24: మండల పరిధిలోని రంగాపురం రహదారి పక్కన గుట్టపై కొలువు తీరిన సమ్మక్క, సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి జాతార ప్రారంభం కానుంది. కోయ తెగల సంప్రదాయం ప్రకారం నిర్వహిచనున్న ఈ జాతర మంగళవారం మండమెలుగు, అమ్మవార్లకు కుంకుమ పూజలతో ప్రారంభం కానుంది. బుధవారం ఒక్క పొద్దు నిర్వహిస్తారు. రాత్రి పది గంటలకు సారలమ్మను గుట్ట నుంచి కిందకు తీసుకొస్తారు. డప్పు చప్పుళ్ల మధ్య గుడికి చేర్చుతారు. గురువారం నిండు జాతర సందర్భంగా మధ్యాహ్నం సమ్మక్కను గిరిజన సాంప్రదాయాలు, నృత్యాలు, మేళతాళాలతో గుడిలో కొలువు తీర్చుతారు. ఈక్రతువును చూసేందుకు రెండుకళ్లు చాలవు. జాతర పేరెన్నికగలది కావడంతో కరకగూడెం మండలం నుంచే కాకుండా పినపాక, ఆళ్లపల్లి, గుండాల, తాడ్వాయి, కాటాపురం, మంగపేట మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. గుట్ట పక్కన వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో భక్తులు మూడు రోజులపాటు ఇక్కడే ఉంటారు. కు టుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక విందులు ఏర్పాటు చేసుకుని ఆనందంగా గడుపుతుంటారు. ఈ ఆలయ నిర్వ హణను పూజారి ఢిల్లీ సరోజని వ్యవహరిస్తున్నారు. కాగా అమ్మవార్లను మరలా గుట్టకు చేర్చడంతో జాతర ముగుస్తుంది. 

జాతర సందర్భంగా వాలీబాల్‌ పోటీలు

సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కరకగూడెం, పినపాక, తాడ్వాయి మండలాల పరిధిలో వాలీబాల్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి ఢిల్లీ సరోజిని తెలిపారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. యువతలో క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.


Updated Date - 2021-01-25T04:26:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising