ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోగ నిర్ధారణ కేంద్రాల్లో తనిఖీలు

ABN, First Publish Date - 2021-06-23T04:48:25+05:30

రోగ నిర్ధారణ కేంద్రాల్లో కనీస ప్రమాణాలు లోపించడంతో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశాల మేరకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు

తనిఖీలు నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కలెక్టర్‌ ఆదేశంతో కదిలిన వైద్య ఆరోగ్యశాఖ 

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

భద్రాచలం, జూన్‌ 22: రోగ నిర్ధారణ కేంద్రాల్లో కనీస ప్రమాణాలు లోపించడంతో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశాల మేరకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 18న ‘రోగ నిర్ధారణ.. ఇలాగేనా?’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో వైద్యఆరోగ్యశాఖ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లాలోని రోగ నిర్ధారణ కేంద్రాలన్నింటినీ పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని ప్రమాణాలు పాటించని నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఆదేశించినట్లు తెలిసింది. దీంతో గత రెండు రోజులుగా భద్రాచలం అడిషనల్‌ డీఎంహెచ్‌వో కార్యాలయంకు చెందిన అధికారులు, సిబ్బంది తని ఖీలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ తనిఖీల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదని వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అత్యధిక శాతం కేంద్రాల్లో అలాగే జీవ వ్యర్థాల నిర్వహణ విషయం వారి పరిశీల నలో తేలినట్లు తెలుస్తోంది. తనిఖీలు పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహిస్తే మరిన్ని వాస్తవాలు, లోపాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని కేంద్రాలకు గత ఏడాది రెన్యువల్‌ కావాల్సిన రిజిస్ట్రేషన్‌లు ఈ రోజుకు సైతం జరగలేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కాగా మరికొన్ని రోగ నిర్ధారణ కేంద్రాల్లో ఇంకా రెన్యువల్‌కు దరఖాస్తు కూడా చేయలేదనే ప్రచారం సైతం ఉంది. 

Updated Date - 2021-06-23T04:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising