ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ ఎకరాకు సాగునీరందిస్తాం

ABN, First Publish Date - 2021-02-28T04:41:54+05:30

నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మండలంలో ఆయన శనివారం విస్తృతంగా పర్యటించారు.

మోతె పెదవాగు వద్ద చెక్‌డ్యాం పనులను పరిశీలిస్తున్న రేగా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే రేగా కాంతారావు 

పలు అభివృద్ధి పనుల పరిశీలన

కరకగూడెం, ఫిబ్రవరి 27: నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మండలంలో ఆయన శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తూరు నుంచి చొప్పాల మీదుగా గొళ్లగూడెం ఆర్‌ఆండ్‌బీ రహదారి వరకు పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో రూ. రెండు కోట్లతో నిర్మించిన బీటీ రహదారిని పరిశీలించారు. అనంతరం చొప్పాలలోని ముసలమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మోతె పెదవాగు వద్ద రూ2.50 కోట్లతో నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరగతి చెక్‌డ్యాం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కరకగూడెంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేగా మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు. త్వరలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలో జరగనున్న పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపును పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర  సమితి విద్యార్ధి విభాగం(టీఆర్‌ఎస్వీ) రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా నియమితులైన మణుగూరు ప్రాంతానికి చెందిన ఎన్‌ఎన్‌ రాజును రేగా అభినందించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ నాయకులు ఆయణ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు రావుల సోమయ్య, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ కొమరం రాంబాబు, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ఎన్‌ రాజు, ఉప సర్పంచ్‌ రావుల రవి, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, రేగా సత్యానారాయణ, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ నాయకులు గుడ్ల రంజిత్‌కుమార్‌, మామిళ్ల శ్రీకాంత్‌, యాంపాటి సందీప్‌, సాయిరాం, చందా హరికృష్ణ, గుమ్మడెల్లి ప్రసా ద్‌, పూజారి కృష్ణ, వేణు, కొండేరు రాము, పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T04:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising