ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

300 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్వాధీనం

ABN, First Publish Date - 2021-01-09T04:57:12+05:30

గుడారాల్లో అక్రమంగా నిల్వ ఉంచి.. ఆ తర్వాత గుజరాత్‌కు తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ఖమ్మం పౌరసరఫరాల శాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కలెక్టరేట్‌, జనవరి 8: గుడారాల్లో అక్రమంగా నిల్వ ఉంచి.. ఆ తర్వాత గుజరాత్‌కు తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ఖమ్మం పౌరసరఫరాల శాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీఎస్వో), డీటీలు రాజేంద్రప్రసాద్‌, విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మానికి సమీపం లోని గోపాలపురం వద్ద గుజరాత్‌ నుంచి వచ్చిన వలస దారులు గుడారాలు వేసుకుని చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇక్కడ నివసిస్తున్న సంచార జాతుల కుటుంబీకుల్లో కొందరు అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని నిల్వ చేస్తూ ఇక్కడి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు లారీల్లో తరలిస్తున్నట్టు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, ఖమ్మం డీఎస్వో రాజేంద్రప్రసాద్‌, డీటీ విజయ్‌బాబు తదితరులు శుక్రవారం తనిఖీలు నిర్వహిం చారు. తరలించడానికి సిద్ధంగా 300 క్వింటాళ్ల బియ్యంతో ఉన్న జీజె 2యూ 7812 నెంబర్‌ లారీని స్వాధీనం చేసుకున్నారు. మంజునాధ, శివరాజ్‌, రవికుమార్‌, ప్రకాష్‌, యోగేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2021-01-09T04:57:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising