ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులుసుబొంతతో పినపాక సస్యశ్యామలం

ABN, First Publish Date - 2021-12-31T05:23:55+05:30

పులుసుబొంత ప్రాజెక్టు నిర్మాణంతో నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సమత్‌ భట్టుపల్లి, మోతె, రంగాపురం సరిహద్దులో నిర్మించనున్న పులుసు బొంత ప్రాజెక్టు కెనాల్‌ రీ-ఎలైన్‌మెంట్‌ను ఇరిగేషన్‌ అధికారులు, అటవీశాఖ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు

ప్రాజెక్టు కెనాల్‌ రీ ఎలైన్‌ మెంట్‌ పరిశీలిస్తున్న రేగా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే రేగా కాంతారావు

అధికారులతో కలిసి కెనాల్‌ రీ-ఎలైన్‌మెంట్‌ పరిశీలన

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కరకగూడెం, డిసెంబరు 30: పులుసుబొంత ప్రాజెక్టు నిర్మాణంతో నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సమత్‌ భట్టుపల్లి, మోతె, రంగాపురం సరిహద్దులో నిర్మించనున్న పులుసు బొంత ప్రాజెక్టు కెనాల్‌ రీ-ఎలైన్‌మెంట్‌ను ఇరిగేషన్‌ అధికారులు, అటవీశాఖ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. మండలంలోని రఘునాథపాలెం, బర్లగూడెం, తాటిగూడెం, వెంకటాపురం గ్రామాల రైతులకు భవిష్యత్తు కోసం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. పులుసు బొంత ప్రాజెక్టు నిర్మిస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అనంతరం సీడీపీ నిధుల నుంచి రూ.10లక్షలతో మోతె, తాటిగూడెం ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. తాటిగూడెం ప్రభుత్వ పాఠశాల వద్ద వంట షెడ్డు నిర్మాణం కోసం రేగా విష్టు చారిటబుల్‌ ట్రస్ట్‌ నుంచి రూ.10 వేలు అందజేశారు. ఇటీవల వెంకటాపురానికి చెందిన పోలెబోయిన రమ్య మృతిచెందగా మృతురాలు కుంటుంబానికి రేగా విష్టు చారిటబుల్‌ ట్రస్ట్‌ నుంచి రూ.20వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఈఈ బాబురావు, డీఈ నాగమల్లేశ్వరరావు, ఏఈ సక్రు, ఎఫ్‌ఎస్‌వో సేవ్యా, సర్పంచ్‌ కొమరం విశ్వనాఽథం, పాయం నరసింహారావు, నాయకులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, చిట్టి సతీష్‌, కొమరం రాంబాబు, రామలింగం, ఎలిపెద్ది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రేగా పర్యటన సందర్భంగా ఏడూళ్లబయ్యారం సీఐ రాజగోపాల్‌, ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.


Updated Date - 2021-12-31T05:23:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising