ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2021-01-26T05:33:01+05:30

గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల కోసం ఇరుజిల్లాల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఖమ్మం పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకలకు పోలీసు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యలోఓ ఏర్పాట్లు చేయగా.. అడిషనల్‌ డీసీపీ ఏఆర్‌ మాధవరావు పర్యవేక్షించారు.

గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఏడీసీపీ మాధవరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఖమ్మంక్రైం/కొత్తగూడెం పోస్టాఫీస్‌సెంటర్‌, జనవరి25: గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల కోసం ఇరుజిల్లాల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఖమ్మం పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకలకు పోలీసు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యలోఓ ఏర్పాట్లు చేయగా.. అడిషనల్‌ డీసీపీ ఏఆర్‌ మాధవరావు పర్యవేక్షించారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం, హాజరయ్యే అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు చేస్తూ ఏర్పాట్లుచేశారు. ఉదయం 9గంటలకు జిల్లా కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించనున్నారు. కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా కలెక్టర్‌ ఎంవీ.రెడ్డి హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం మార్చ్‌ఫాస్ట్‌, వందన స్వీకారం, ప్రసంగం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల వారికి ప్రశంసా పత్రాలు అందించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏఎస్పీ కిష్టయ్య ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 

కూరగాయలతో జాతీయ జెండా

కొణిజర్ల, జనవరి 25 : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కొణిజర్ల ప్రభుత్వ పాఠాశాల పీడీ దొండపాటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సోమవారం కూరగాయలతో జాతీయ జెండాను తీర్చిదిద్దారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచుకునేలా అవగాహన కల్పిస్తూ క్యారెట్‌, తెల్ల ఉల్లిగడ్డలు, దొండకాయలతో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ఈ జెండా రూపకల్పనలో ఉపాధ్యాయులు శ్వేత, లావణ్య సహకరించగా.. పీడీకి పాఠశాల హెచ్‌ఎం అభినందనలు తెలిపారు.




Updated Date - 2021-01-26T05:33:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising