ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌సీ వర్తింప చేయాలని ధర్నా

ABN, First Publish Date - 2021-03-25T05:15:04+05:30

గ్రామపంచాయతీ కార్మికులందరికీ పీఆర్‌సీ వర్తింపచేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుమ్ముగూడెం/ అశ్వారావుపేట/ భద్రాచలం టౌన్‌, మార్చి 24: గ్రామపంచాయతీ కార్మికులందరికీ పీఆర్‌సీ వర్తింపచేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పల్లె ప్రజలకు అత్యవసర సేవలందజేస్తున్న పంచాయతీ కార్మికులను విస్మరించడం అన్యాయమని సంఘం జిల్లా కోశాధికారి జిపద్మ అన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. అనంతరం ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో ముత్యాలరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు చిలకమ్మ, కన్నయ్య, నరేష్‌, భవాని, జానకి, జంపన్న, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్‌సీని వర్తింపచేయాలని, పెండింగ్‌ వేతనాలను తక్షణమే చెల్లించాలని గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయు ఆధ్వర్యంలో అశ్వారావుపేట ధర్నాను చేపట్టారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేసి, ఎంపీడీవో సూపరింటెండెంట్‌కు వినతి పత్రంను అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్‌, కామేశ్వరరావు, అప్పన్న, నాగేంద్రరావు, నందు, నాగేశ్వరరావు, భూషణం, ఆనంద్‌, మహేష్‌, రత్నం పాల్గొన్నారు. 

  గ్రామ పంచాయితీల్లో వివిధ కేటగిరీల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వర్తింప చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్లు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్‌, ఎంబీ నర్సారెడ్డి, వెంకటరెడ్డి, నాగరాజు, నాగేశ్వరరావు, కృష్ణ, రామకృష్ణ, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-03-25T05:15:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising