ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊట్లపల్లిలో పోడు వివాదం

ABN, First Publish Date - 2021-02-24T05:11:06+05:30

మండలంలోని ఊట్లపల్లిలో గిరిజనులు, అటవీశాఖ అధికారుల మధ్య మంగళవారం పోడు వివాదం జరిగింది. తాము సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో మొక్కలు నాటితే సహించేదిలేదంటూ గిరిజనులు అటవీశాఖ అధికారులు ప్రారంభించిన పనులను అడ్డుకున్నారు.

పనులను అడ్డుకున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనులను అడ్డుకున్న గిరిజనులు

అశ్వారావుపేట రూరల్‌, ఫిబ్రవరి 23: మండలంలోని ఊట్లపల్లిలో గిరిజనులు, అటవీశాఖ అధికారుల మధ్య మంగళవారం పోడు వివాదం జరిగింది. తాము సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో మొక్కలు నాటితే సహించేదిలేదంటూ గిరిజనులు అటవీశాఖ అధికారులు ప్రారంభించిన పనులను అడ్డుకున్నారు. ఊట్లపల్లి సమీపంలో కొంతకాలం గా గిరిజనులు పోడుభూములు సాగుచేసుకుంటున్నారు. దాదాపు అనేక కుటుంబాలు 155 హెక్టార్లలో పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. ఇదే తరుణంలో అటవీశాఖ అధికారులు 85 హెక్టార్లలో మొక్కలు నాటాలని నిర్ణయించి మంగళవారం కందకాలు తీసే పనులను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న గిరిజనులు పోడుభూముల వద్దకు వచ్చి పనులను అడ్డుకున్నారు. పనులు చేసి తమ పొట్ట కొట్టవద్దంటూ వాహనం ఎదుట బైఠాయించారు. దీంతో అధికారులు పనులను నిలిపివేశారు. సాయంత్రం వరకు అటవీశాఖ అధికారులు, గిరిజనుల మధ్య చర్యలు సాగుతూనే ఉన్నాయి. పోడు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న తమకు అటవీహక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వకపోగా మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సమాయత్తమవడంత దారుణమని గిరిజనులు వాపోయారు. తాము ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పోడుభూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2021-02-24T05:11:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising