ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ వైఫల్యంతోనే కరోనా మరణమృదంగం

ABN, First Publish Date - 2021-05-15T05:49:53+05:30

ప్రధాని నరేంద్రమోదీ వైఫల్యమే దేశంలో కరోనా మరణ మృదంగానికి కారణమైందని, అంతర్జాతీయ వైద్య నిపుణుల సలహాలను పట్టించుకోకుం డా నివారణ చర్యలను పకడ్బందీగా అమలు చేయని ఫలితంగా వేలాది మంది మృత్యువాత పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించా రు.

వైరా బోడేపూడి భవన్‌లో పుస్తకావిష్కరణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వైద్యనిపుణుల సూచనలను పట్టించుకోని ఫలితం

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

 వైరాలో కల్లోల భారతం, తిరోగమన భారతం పుస్తకాల ఆవిష్కరణ 

వైరా, మే 14 : ప్రధాని నరేంద్రమోదీ వైఫల్యమే దేశంలో కరోనా మరణ మృదంగానికి కారణమైందని, అంతర్జాతీయ వైద్య నిపుణుల సలహాలను పట్టించుకోకుం డా నివారణ చర్యలను పకడ్బందీగా అమలు చేయని ఫలితంగా వేలాది మంది మృత్యువాత పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించా రు. వైరా స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ప్రచురించిన కల్లోల భారతం, తిరోగమన భారతం పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం వైరాలోని బోడేపూడి వెంకటేశ్వర రావు భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తమ్మినేని ముఖ్యఅతిథిగా అన్‌లైన్‌ వీడియో కాల్‌లో ప్రసంగించారు. దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ వ్యాప్తిచెందకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవ డంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. అందువల్లే శ్మశానవాటికల్లో చితిమంటలు ఆగటం లేదని దుయ్యబట్టారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కనీసం ఆక్సిజన్‌ అందించలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ విద్యా, వైద్యం కోసం ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో అత్యంత ప్రమాదకరమైన విభజన రాజకీయాలు తీసుకువచ్చి ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించ కుండా కార్పొరేట్‌ సంస్థలకు పాలకులు పెద్దపీట వేస్తు న్నారని విమర్శించారు. ఎన్డీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ప్రపంచంలో అనేక దేశా లు కొవిడ్‌ నియంత్రణలో విజయవంతంగా ముందు కుసాగుతున్నాయని అందుకు భిన్నంగా మన దేశంలో ప్రభుత్వ విధానాల కారణంగా కరోనా విజృంభణ జరుగుతోందని విమర్శించారు. వైరా స్టడీ సర్కిల్‌ కన్వీనర్‌ బోడపట్ల రవీందర్‌ ఎంతో శ్రమించి కల్లోల భారతం, తిరోగమన భారతం పుస్తకాలను ముద్రించటాన్ని వారు అభినందించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివ ర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి కె.ఆనందాచారి, ప్రముఖ విద్యావేత్త ఐవీ.రమణారావు, సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు. ఇంగ్లీష్‌ అనువాద వ్యాస సంకలనం చేసిన స్టడీ సర్కిల్‌ కన్వీనర్‌ బోడపట్ల రవీందర్‌ తన అనుభవాలను వివరించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బొంతు రాంబాబు, రచయితలు డాక్టర్‌ సీతారాం, మువ్వా శ్రీనివాసరావు, టీఎల్‌.నర్సయ్య, బండారు రమేష్‌, మల్లెంపాటి వీరభద్రరావు, నాయకులు తోట నాగేశ్వరరావు, చింతనిప్పు చలపతిరావు, మందడపు రామారావు, చెరుకుమల్లి కుటుంబరావు, అనుమోలు రామారావు, మల్లెంపాటి ప్రసాద్‌, వర్మ పాల్గొన్నారు.


Updated Date - 2021-05-15T05:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising