ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదవులు కావాలి.. పార్టీ కోసం పనిచేయరా..?: ఎమ్మెల్యే రాములునాయక్‌ ఆగ్రహం

ABN, First Publish Date - 2021-02-26T05:30:00+05:30

‘నాయకులకు పదవులు కావాలి? పార్టీ అభివృద్ధికోసం పనిచేయారా? అలా పనిచేయని నాయకులకు పదవులు ఎందుకు వెళ్లి ఇంట్లో కూర్చోండి’ అంటు కారేపల్లిలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై ఎమ్మెల్యే రాములునాయక్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాములునాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కారేపల్లి ఫిబ్రవరి 26: ‘నాయకులకు పదవులు కావాలి? పార్టీ అభివృద్ధికోసం పనిచేయారా? అలా పనిచేయని నాయకులకు పదవులు ఎందుకు వెళ్లి ఇంట్లో కూర్చోండి’ అంటు కారేపల్లిలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై ఎమ్మెల్యే రాములునాయక్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై నాయకులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని పంచాయతీలనుంచి పెద్దమొత్తంలో కార్యకర్తలను సమావేశానికి తీసుకరావాల్సిన నాయకుల, ప్రజాప్రతినిధులు మాత్రమే పట్టుమని పదిమంది కార్యాలయంవద్దకు చేరుకున్నారు.అదేసయమంలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే కార్యకర్తలు ఎవరు లేకపోవడంతో కోపంతో అసహనం వ్యక్తంచేశారు. అక్కడవున్న నాయకులు,ప్రజాప్రతినిధులపై ఆగ్రహాం వ్యక్తం చేస్తు మీకు మాత్రం పదవులుకావాలి, పార్టీకోసం, కార్యకర్తల కోసం పనిచేయారా?అలాంటప్పుడు మీకు పదవులు ఎందుకు దండగా, ఇంట్లో కూర్చోండి అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయం సమీపిస్తుంది. మరోవైపు సభ్యత్వాల నమోదు కార్యక్రమం పూర్తిచేయలేదు. ఇంక ఏప్పుడు చేస్తారు? అంటు మండిపడ్డారు. ఐదు నిమిషాల్లో ఎమ్మెల్యే కారేపల్లి నుంచి వైరా వెళ్లి పోయారు. ఎమ్మెల్యే ఆగ్రహంతో కంగు తిన్న పార్టీ నాయకులు రెండు రోజుల్లో సభ్యత్వాలు పూర్తిచేయాలని నిర్ణయంతో వెళ్ళి పోయారు. ఈకార్యక్రమంలో వైరా ఆత్మ చైర్మన్‌ ముత్యాల సత్యానారాయణ, వైస్‌ ఎంపీపీ రావూరి శ్రీనివా్‌సరావు, సంత ఛైర్మన్‌ మల్లెల నాగేశ్వరరావు, మండలపార్టీ అధ్యక్షకార్యాదర్శులు తోటకూరిపిచ్చయ్య, అజ్మీరవీరన్న, మండల మహిళ అధ్యక్షురాలు పద్మావతి, బత్తుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising