ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓయూ లా కళాశాల ప్రిన్సిపాల్‌గా జిల్లా ఆదివాసీ మహిళ

ABN, First Publish Date - 2021-09-17T06:19:28+05:30

ఓయూ లా కళాశాల ప్రిన్సిపాల్‌గా జిల్లా ఆదివాసీ మహిళ

బాధ్యతలు స్వీకరిస్తున్న గుమ్మడి అనురాధ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూనివర్సిటీ చరిత్రలో తొలిసారి నియామకం

ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి కూతురు అనురాధకు దక్కిన అరుదైన అవకాశం..

ఆమె నియామకం పట్ల సర్వత్రా హర్షం

ఇల్లెందు టౌన్‌, సెప్టెంబరు 16: ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నూరేళ్ల చరిత్రలోనే లా కళాశాలకు తొలిసారి ఓ ఆదివాసీ మహిళ ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడినర్సయ్య కూతురు గుమ్మడి అనురాధను ప్రిన్సిపాల్‌ అనురాధ ప్రస్తుతం ఓయు పీజీ, లా కళశాలల్లో లా విభాగంలో  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ఆమెను ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇల్లెందు నియోజకవర్గానికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గుమ్మడినర్సయ్య కూతురైన అనురాధ మూడేళ్ల క్రితం న్యాయవాద విద్యను పూర్తిచేసి ఉస్మానియా యూనివర్సీటీ అనుబంధ లా కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించారు. అనంతరం కొద్దికాలంలోనే అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌ కావడం అభినందనీయమని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని సింగరేణి మండలం, టేకులగూడెం గ్రామానికి చెందిన అనురాధ ఓయూ లా కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులవడం పట్ల ఆదివాసీ సంఘాలతో పాటు పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-09-17T06:19:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising