ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అని‘ధర’సాధ్యమైన డిమాండ్‌

ABN, First Publish Date - 2021-03-06T05:08:17+05:30

ఆయిల్‌పామ్‌ గెలలకు కనీ వినీ ఎరుగని స్థాయిలో డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో ధర రాకెట్‌లా దూసుకుపోతోంది. ధర ప్రతి నెలా పెరుగు తూ వస్తుండటంతో రైతుల మోముల్లో సంతోషాలు వెల్లువిరుస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రికార్డు స్థాయిలో పెరుగుతున్న పామాయిల్‌ గెలల ధర 

హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

అశ్వారావుపేట, మార్చి 5: ఆయిల్‌పామ్‌ గెలలకు కనీ వినీ ఎరుగని స్థాయిలో డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో ధర రాకెట్‌లా దూసుకుపోతోంది. ధర ప్రతి నెలా పెరుగు తూ వస్తుండటంతో రైతుల మోముల్లో సంతోషాలు వెల్లువిరుస్తున్నాయి. ఏడాది క్రితం టన్ను పామాయిల్‌ గెలల ధర రూ. ఏడు నుంచి ఎనిమిది వేల మధ్య ఉండగా, 2020 జనవరి నుంచి పామాయిల్‌ గెలల ధర నిదానంగా పెరుగుతూ వస్తోంది. మార్చి, 2021(ఈ నెలలో) టన్ను ఒక్కంటికి ఏకంగా రూ.15,923 లకు పెరిగి రికార్డు స్థాయికి చేరినట్టు ఆయిల్‌ఫెడ్‌ అధికారులు ప్రకటించారు. గత నెలలో టన్ను ధర రూ.15,147 ఉంది. అంటే టన్నుకు రూ.776లు పెరిగింది. 2020 జనవరి నుంచి పామాయిల్‌ ధరను పరిశీలిస్తే 2020 జూన్‌లో తప్ప ప్రతీ నెల టన్ను ధర రూ.10 వేలు దాటింది. అది తాజాగా రూ.16వేలకు చేరువవడంతో గత ఏడాది ఏకంగా టన్ను ధర 90 శాతానికి పైగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇదే ధర కొనసాగితే భవిష్యత్‌లో పామాయిల్‌ తోటలు మరింత విస్తరించే అవకాశాలున్నా యి. రైతులకు మంచి ధర పలకడంతో అధికారుల కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గెలల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పామాయిల్‌ను విస్తరించాలనే ప్రణాళికను సులువుగా అమలు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-03-06T05:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising