ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డబుల్‌’ ఇళ్లలో ట్రబుల్స్‌

ABN, First Publish Date - 2021-07-26T04:47:30+05:30

మండలంలోని చండ్రుపట్ల గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కాలనీలో విద్యుత, తాగునీటి సౌకర్యం లేక లబ్ధిదారులు ఇబ్బంది పడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విద్యుత, తాగునీటి సౌకర్యం లేక లబ్ధిదారుల ఇక్కట్లు

కల్లూరు, జూలై 25:  మండలంలోని చండ్రుపట్ల గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్‌బెడ్‌రూం  ఇళ్ల కాలనీలో విద్యుత, తాగునీటి సౌకర్యం లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు.  మూడు నెలల క్రితం మండల స్థాయి అధికారులు 20మంది లబ్ధిదారులను ఎంపికచేసి వారికి ఇళ్లు అందజేశారు. అయితే ఆ ఇళ్లలో విద్యుత సౌకర్యం లేదని, తాము అంధకారంలో నివసిస్తున్నామని బాధితులు దుగ్గిరాల లక్ష్మి, మేకల సరిత, మొగిలి మాణిక్యం ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాకాల సీజన కావటంతో రాత్రిపూట విషపు పురుగులు, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.  పలుమార్లు అధికారుల దృష్టికితెచ్చిన వారు స్పందించటంలేదని అన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించలేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని బాధితులు కోరుతున్నారు.

కలెక్టర్‌ నుంచి నిధులు రావాల్సి ఉంది: తహసీల్దార్‌ మంగీలాల్‌

 చండ్రుపట్ల గ్రామంలోని డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కాలనీలో విద్యుత సరఫరాకు సంబంధించిన నిధులు కలెక్టర్‌ నుంచి విద్యుత శాఖకు కేటాయించాల్సి ఉంది. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్‌ పరిధిలో విద్యుత సరఫరా అంశం లేదు. మిషన భగీరథ పథకం నుంచి సామూహికంగా రెండు కుళాయిలను మాత్రమే ఏర్పాటు చేశాం. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

 


Updated Date - 2021-07-26T04:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising