ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులు వేధిస్తున్నారని ఉద్యోగి నిరసన

ABN, First Publish Date - 2021-06-23T05:07:23+05:30

‘సస్పెండ్‌ చేసి 139 రోజులు అయింది.. ఇంకా విచారణ పేరుతో కాలాయాపన చేస్తూ, ఉద్దేశ్యపూర్వకంగానే అధికారులు వేధిస్తున్నారు..’ అంటూ నగరపాకల సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ సస్పెన్షన్‌కు గురైన సయ్యద్‌ ఇజాజ్‌పాషా మంగళవారం కార్యాలయ ఆవరణలోనే నిరసన దీక్ష చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కార్పోరేషన్‌, జూన్‌22: ‘సస్పెండ్‌ చేసి 139 రోజులు అయింది.. ఇంకా విచారణ పేరుతో కాలాయాపన చేస్తూ, ఉద్దేశ్యపూర్వకంగానే అధికారులు వేధిస్తున్నారు..’ అంటూ నగరపాకల సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ సస్పెన్షన్‌కు గురైన సయ్యద్‌ ఇజాజ్‌పాషా మంగళవారం కార్యాలయ ఆవరణలోనే నిరసన దీక్ష చేపట్టారు. ఈ ఏడాది జనవరి నెలాఖరులో నగరపాలక సంస్థ కార్యాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చారు. ఆ సమయంలో జాబితా తయారుచేసిన వారు జూనియర్‌ అసిస్టెంట్‌ ఇజాజ్‌పాషా గతంలో సస్పెండ్‌ అయ్యారని, అతడు ప్రమోషన్‌కు అనర్హుడని కమిషనర్‌ అనురాగ్‌ జయంతికి చెప్పటంతో వివాదం మొదలయింది. పనిష్మెంట్‌ కింద ఇంక్రిమెంట్‌ను నిలిపివేశారని, అందువల్ల తనకు ప్రమోషన్‌ రావవాలని, సస్పెండైన ఒక ఉద్యోగి ప్రమోషన్ల జాబితా తయారు చేయటం ఏంటని ఇజాజ్‌ పాషా కమిషనర్‌ ఛాంబర్‌ ఎదుటే సహాయ కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో కమిషనర్‌ అతడిని ఫిబ్రవరి 3న సస్పెండ్‌ చేశారు. దీనిపై అదేనెల 8న సస్పెండైన ఇజాజ్‌పాషా మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. అనంతరం నగరపాలక సంస్థ ఎస్‌ఈను విచారణ అధికారిగా నియమించారు. ఒక ఇంక్రిమెంట్‌ నిలిపివేసి, తిరిగి ఇజాజ్‌పాషాను ఉద్యోగంలోకి తీసుకు నేలా నోట్‌ఫైల్‌ తయారుచేశారు. దీనివల్ల తన ప్రమోషన్‌కు ఆటంకం కలుగుతుందని ఇజాజ్‌ పాషా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో 30 మందిని సస్పెండ్‌ చేసి, స్వల్పకాలంలోనే తిరిగి విధుల్లో చేర్చుకున్నారని, తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ 139 రోజులు గడిచినా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. అధికారుల వేధిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం కార్యాలయ ఆవరణలోని పాత బిల్డింగ్‌వద్ద నిరసన దీక్షను అజీజ్‌పాషా చేపట్టారు.

Updated Date - 2021-06-23T05:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising