ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవమి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం... భద్రాద్రి ఆలయంలో ప్లవ నామ ఉగాది పంచాంగ శ్రవణం

ABN, First Publish Date - 2021-04-14T05:41:38+05:30

భద్రాద్రి శ్రీ సీతారాములవారి వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం సంప్రదాయ బద్ధంగా ప్రారంభమయ్యాయి. శ్రీ ఫ్లవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ముందుగా మూలవరులకు పంచామృతాభిషేకం నిర్వహించారు.

భద్రద్రి రామయ్యకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూలవరులకు పంచామృతాభిషేకం

రామయ్య  ఆదాయం:14 వ్యయం:2

సీతమ్మవారి ఆదాయం:5, వ్యయం :5

భద్రాచలం, ఏప్రిల్‌ 13: భద్రాద్రి శ్రీ సీతారాములవారి వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం సంప్రదాయ బద్ధంగా ప్రారంభమయ్యాయి. శ్రీ ఫ్లవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ముందుగా మూలవరులకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అలాగే వేప పూత ప్రసాద వినియోగం చేశారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా నవహ్నిక మహోత్సవాలకు 17న శ్రీకారం చుట్టనున్నారు. 21న శ్రీ సీతా రామ చంద్రస్వామి కల్యాణం, 22న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 27 వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 

చెన్నావజ్జుల పంచాంగ శ్రవణం..

ఫ్లవనామ సంవత్సరంలో భద్రాద్రి రామయ్యకు ఆదాయం 14, వ్యయం 2గా ఉండనుంది. అలాగే సీతమ్మవారికి ఆదా యం 5, వ్యయం 5గా ఉండనున్నట్లు దేవస్థానం ఆస్థాన పురోహితులు చెన్నావ జ్జుల వెంకటేశ్వర అవధాని పేర్కొన్నారు. ఉగాదిని పురస్కరించుకొని ముందుగా సీతారామచంద్రస్వామిని నిత్యకల్యాణ మండపవేదిక వద్దకు తీసుకువచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆస్థాన పురోహితులు పంచాంగం వినిపించారు. ఈసారి యాసంగిలో మాత్రమే పంటలు పండుతాయని వాటి దిగుబడి కూడా తక్కు వ మొత్తంలో ఉండే అవకాశం ఉందన్నారు. నల్లని భూముల్లో నల్ల ధాన్యాలు సమృద్ధిగా పండుతాయన్నారు. అంతకు ముందు ఆస్థాన పురోహితులకు పంచాంగాన్ని, కొబ్బరిబొండాన్ని ఏఈవో భవానీరామకృష్ణారావు అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అర్చకులు పొడిచేటి రామభద్రాచా ర్యులు, విశ్రాంత ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-14T05:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising