ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్‌.. జాతీయస్థాయి నెట్‌బాల్‌ పోటీల ప్రారంభంలో కలెక్టర్‌ కర్ణన్‌

ABN, First Publish Date - 2021-02-25T04:49:11+05:30

క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్‌.. జాతీయస్థాయి నెట్‌బాల్‌ పోటీల ప్రారంభంలో కలెక్టర్‌ కర్ణన్‌

మాట్లాడుతున్న ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోటీలకు 13 రాష్ట్రాల జట్లు రాక

ఖమ్మంస్పోర్ట్స్‌, ఫిబ్రవరి 24: క్రీడల్లో రాణింపుతో భవిష్యత్‌ బంగారు బాట అవుతుందని  ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం సర్దార్‌పటేల్‌స్టేడియంలో జరిగిన 33వ జూనియర్‌ జాతీయ స్థాయి బాలబాలికల నెట్‌బాల్‌ పోటీల ప్రారంభానికి హాజరైన ఆయన మాట్లాడారు. ప్రతీ క్రీడాకారుడు క్రీడల్లో మెళకువలు నేర్చుకోవాలని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా స్పోర్ట్స్‌ కోటా ద్వారా ఉద్యోగాలు గుర్తింపు లభిస్తాయన్నారు. క్రీడావసతుల కల్పనలతో రాష్ట్రంలో ఖమ్మం నెంబర్‌వన్‌గా ఉందన్నారు. పటేల్‌ స్టేడియంలోని క్రీడావసతులు ఎంతగానో అభివృద్ధి చేశామని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ పోటీలకు తెలంగాణతో పాటు ఏపీ, హర్యానా, ఢిల్లీ, యూపీ, ఒడిస్సా, కేరళ, కర్ణాటక, పంజాబ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌ రాష్ట్రాలనుంచి జట్లు పాల్గొన్నాయి. పోటీలకు వచ్చిన క్రీడాకారులకు స్టేడియంలోని నూతన వసతి గదుల్లో బస కల్పించారు. ప్రారంభ కార్యక్రమంలో డీవైఎస్‌వో పరంధామిరెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ గంటా వెంకటరావు,  నెట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర బాధ్యులు, రాష్ట్ర సెక్రటరీ ఖాజాఖాన్‌, జిల్లా కార్యదర్శి ఫణికుమార్‌, సిరిపురపు సుదర్శన్‌రావు, ప్రముఖ వైద్యుడు కూరపాటి ప్రదీప్‌, దీప్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T04:49:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising