ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యానశాఖ అధికారికి జాతీయ అవార్డు

ABN, First Publish Date - 2021-02-23T05:31:23+05:30

జిల్లా ఉద్యాన శాఖలో పని చేస్తున్న అధికారి సందీప్‌కు జాతీయస్థాయి అవార్డు వరించింది. భారతీయ దళిత సాహీత్య అకాడమీ దిల్లీ సంస్థ అవార్డును సోమవారం ప్రకటించింది.

అవార్డు లేఖను సందీప్‌కు అందిస్తున్న జిల్లా ఉద్యానశాఖ అధికారి అనసూయ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 13న ప్రధాని మోదీ నుంచి స్వీకారం

ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి22: జిల్లా ఉద్యాన శాఖలో పని చేస్తున్న అధికారి సందీప్‌కు జాతీయస్థాయి అవార్డు వరించింది. భారతీయ దళిత సాహీత్య అకాడమీ దిల్లీ సంస్థ  అవార్డును సోమవారం ప్రకటించింది. అంబేద్కర్‌ జాతీయ విశిష్ట సేవా పురస్కారం 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డు అకాడమీ జాతీయ అధ్యక్షుడు సుమనాష్కర్‌ జిల్లా ఉద్యానశాఖ అధికారి కార్యాలయానికి లేఖ పంపారు. సందీప్‌ ప్రస్తుతం జిల్లా ఉద్యానశాఖలో ఖమ్మం నియోజకవర్గ ఉద్యానశాఖ అధికారిగా పని చేస్తున్నారు. స్వగ్రామం కొణిజర్ల మండలం చిన్నమునగాల గ్రామం. ఈ అవార్డును వచ్చేనెలల 13న దిల్లీలో జరుగనున్న భారతీయ దళిత సాహిత్య అకాడమి 36 జాతీయ సదస్సులో ప్రధాని, న్యాయశాఖ కేంద్రమంత్రి నుంచి అందుకోన్నున్నారు. సందీప్‌ సామాజిక సేవాకార్యక్రమాల్లో సైతం ముందుంటూ సేవా కార్యక్రమాల్లో పంచుకునేవాడు.  లాక్‌డౌన్‌ సమయంలో స్వచ్ఛంద సంస్థల కార్యక్రమల్లో పాల్గొన్నాడని తోటి ఉద్యోగులు చెప్పారు.  ఈ నేపథ్యంలో సందీప్‌ను జిల్లా ఉద్యానశాఖ అఽధికారి జీ. అనసూయ  సత్కరించారు. తోటి ఉద్యోగులు అభినందించారు.

జానపదంలో సునీతకు జాతీయ అవార్డు

సత్తుపల్లిరూరల్‌, ఫిబ్రవరి 22: వరంగల్‌ పోతన ఆడిటోరియంలో శ్రీ శాంతి కృష్ణ కళాసేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 20న నిర్వహించిన జాతీయ స్థాయి జానపద నృత్య మహోత్సవంలో సత్తుపల్లికి చెందిన పేరాబత్తుల సునీతకు అవార్డు వరించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ జానపద నృత్య కళాకారుడు డాక్టర్‌ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం మాట్లాడుతూ.. తన శిష్యబృందం అద్భుత ప్రదర్శన కనబరిచిందని, రాయల సర్వింద్‌ కాళ్లకు కడియాలు అనే నృత్యంతో అలరించాడన్నారు. జానపద కళలను ఆదరించడంతో తెలంగాణ ప్రాంతం ఎప్పుడూ ముందుంటుందన్నారు. 

Updated Date - 2021-02-23T05:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising