ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత కుటుంబాలకు నామా పరామర్శ

ABN, First Publish Date - 2021-09-18T05:30:00+05:30

టీఆర్‌ఎస్‌ లోక్‌సభాక్షపనేత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు శనివారం ఎర్రుపాలెం మండలంలో పర్యటించారు.

సీఎం సహాయనిధి చెక్కులను అందిస్తున్న నామ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రుపాలెం, సెప్టెంబరు18: టీఆర్‌ఎస్‌ లోక్‌సభాక్షపనేత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు శనివారం ఎర్రుపాలెం మండలంలో పర్యటించారు. ఈపర్యటనలో భాగంగా రామన్నపాలెం, ఇనగాలి, సఖినవీడు, తక్కెళ్లపాడు, పెగళ్లపాడు, రేమిడిచర్ల, పెద్దగోపవరం, బనిగండ్లపాడు, చొప్పకట్లపాలెం గ్రామాల్లో ఈ పర్యటన సాగింది. ఇటీవల మరణించిన వారి కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న మరికొందరిన పరామర్శించారు.   ఎంపీ   సిఫార్సుమేరకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఆయా గ్రామాల్లో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అందించారు. ఈ కార్యక్రమాల్లో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్‌ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మధిర మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చావా రామకృష్ణ,, జడ్పీటీసీ శీలం కవిత, మండల పార్టీ అద్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ఎర్రుపాలెం సొసైటీ చైర్మన్‌ మల్పూరి శ్రీనివాసరావు, చిత్తారు సింహాద్రి యాదవ్‌, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు మొగిలి అప్పారావు, రైతుబంధు మండల కన్వీనర్‌ శీలం వెంకటరామిరెడ్డి, మండల నాయకులు కొండెపటి సాంబశివరావు, పంబి సాంబశివరావు, మండల పార్టీ కార్యదర్శి నారాయణ, త్రివేణి, , ఉమా మహేశ్వరి పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కొండలరావు కుటుంబానికి నామా పరామర్శ

బోనకల్‌, సెప్టెంబరు 18: మండలంలోని రాయన్నపేట గ్రామంలో ఇటీవల మృతిచెందిన గుమ్మడవెల్లి కొండలరావు కుటుంబాన్ని శనివారం నామా నాగేశ్వరరావు పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్‌ నలమల వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు బంధం శ్రీనివాసరావు, చేబ్రోలు మల్లిఖార్జున్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ జంగా రవి, ఉపసర్పంచ్‌ ఉయ్యూరి రాధాకృష్ణ, నాయకులు రెడ్డిబోయిన ఉద్దండు, కాకాని శ్రీను పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising