ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఎన్నికల్లో మోదీ, కేసీఆర్‌కు పరాభావం తప్పదు

ABN, First Publish Date - 2021-10-29T05:41:11+05:30

వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌కు పరాభావం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

కొణిజర్ల, అక్టోబరు 28: వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌కు పరాభావం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌కు ఎదురుగాలి మొదలైందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో ఇద్దరూ విఫలమయ్యారని విమర్శించారు. భవిష్యత్‌ ఎర్రజెండాలదేనని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని తనికెళ్ల గ్రామంలో లింగాల యోహాన్‌నగర్‌లో కొప్పుల కృష్ణయ్య, పుళ్లూరి భూలక్ష్మీ, చింతపల్లి ప్రసాద్‌, బోయినపల్లి శ్రీనివాస రావు అధ్యక్షవర్గంగా జరిగిన సీపీఎం మండల మహాసభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న లక్షల కోట్ల నల్లధనాన్ని తీసుకువచ్చి  ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నాలుగు కోట్ల ఉద్యోగాలు ఊడగొట్టిన ఘన త మోదీదే అని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి వ్యతిరేక విధానాలకు పాల్పడుతుం దని విమర్శించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-10-29T05:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising