ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన నామినేషన్ల పర్వం.. మండలి పోటీకి 76మంది ఆసక్తి, చివరి రోజు 28 నామినేషన్లు

ABN, First Publish Date - 2021-02-24T05:06:05+05:30

నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది.

ర్యాలీగా వెళుతున్న పల్లా, సంఘీభావం తెలుపుతున్న జయసారధి రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీలక నేతలు వెంట రాగా పల్లా, జయసారఽథిల ర్యాలీలు

నేడు పరిశీలన, 26న ఉపసంహరణ

నల్లగొండ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈనెల 16 నుంచి మంగళవారం వరకు మొత్తం 76 మంది నామినేషన్లు వేయగా.. చివరిరోజున భారీగా 28మంది తమ నామపత్రాలను సమర్పించారు. ఇక 24న నామినేషన్ల పరిశీలన జరగనుండగా 26న ఉపసంహరణకు చివరి తేదీ. దీంతో 26 సాయంత్రానికి బరిలో మిగిలే అభ్యర్థులపై స్పష్టత రానుంది. అయితే గతంలో జరిగిన ఎన్నికల్లో 30 నామినేషన్లు దాఖలవగా చివరకు 22 మంది బరిలో నిలిచారు. కానీ ఈసారి 76మంది నామినేషన్లు వేయడంతో ఈ ఎన్నిక ఈ సారి సాధారణ ఎన్నికలను మరపిస్తోంది. గత ఎన్నికలో 2.50లక్షల మంది ఓటర్లుండగా.. 1.50 లక్షల మంది మాత్రమే ఓటు వేశారు. ఈ సారి 5లక్షల మంది తమ ఓటు హక్కు నమోదు చేయించుకున్నారు. చివరి రోజున అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి, సీపీఎం బలపరిచిన సీపీఐ అభ్యర్థిగా జయసారధి రెడ్డి భారీ ర్యాలీలతో నామినేషన్లు వేశారు. పల్లా నామినేషన్‌కు మంత్రులు జగదీష్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జయసారథిరెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్ములు తమ్మినేని వీరరఽభదం, చాడా వెంకటరెడ్డి, మూడు జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. అయితే ఒకే సమయంలో కలెక్టరేట్‌ వద్దకు పల్లా, జయసారథి ర్యాలీలు చేరుకోవడంతో ట్రాఫిక్‌ జాం అయ్యింది. ఈ క్రమంలో జయసారధిని బలపరిచే నేతలు అందులో చిక్కుకుపోగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పదినిమిషాలు దాటినా వారు పట్టించుకోకపోవడంతో మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్మి మల్లు లక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది, ఇదే అంశంపై కలెక్టర్‌ పీజే పాటిల్‌కు ఫిర్యాదు చేసినట్టు సీపీఎం జిల్లా కార్యదర్మి వర్గ సభ్యుడు తుమ్మల వీరారెడ్డి తెలిపారు. అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రాంతాల్లో ఫెక్ల్సీలు, తోరణాలు, జెండాలు ఏర్పాటు చేశారని, క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో డీజే పెట్టి, పెద్ద సంఖ్యలో మతాబులు పేల్చారు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు విధుల్లో ఉండగా టీఆర్‌ఎస్‌ నేతల డీజే ర్యాలీ కోర్టు ముందుగా వెళ్లిందని వీటిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించిన ఫొటో, వీడియో ఆధారాలు జిల్లా కలెక్టరుకు బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు నూకల నర్సింహారెడ్డి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నాయకులు అనుమతి కోరినా ఇవ్వలేదని, తమ డీజే వాహనాన్ని ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

మండలి బరికి 76మంది నామినేషన్లు

 నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈనెల 16 నుంచి మంగళవారం వరకు మొత్తం 76 మంది నామినేషన్లు వేయగా.. చివరిరోజున భారీగా 28మంది తమ నామపత్రాలను సమర్పించారు. బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా సభావత్‌ రాములునాయక్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి, తెలంగాణ జనసమితి అభ్యర్థిగా ముద్దసాని కోదండరాంరెడ్డి, యువతెలంగాణ పార్టీ అభ్యర్థిగా గోగుల రాణీరుద్రమ, సీపీఐ అభ్యర్థిగా బ్రాహ్మణపల్లి జయసారఽఽధిరెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అభ్యర్థిగా డా. చెరుకు సుధాకర్‌, ఆమ్‌ఆద్మీ తరపున నల్లమోతు తిరుమలరావు, జై స్వరాజ్‌ పార్టీ తరపున కాసాని శ్రీనివాసరావు, తెలంగాణ ప్రజాపార్టీ తరపున జూపూడి నాగార్జున రావు,  నేషనల్‌ యువతెలంగాణ పార్టీ అభ్యర్థిగా వింజపూరి రాఽధాకృష్ణ, యువతరం పార్టీ తరపున కొర్లకంటి ప్రకాష్‌రావు, దళిత బహుజన పార్టీ తరపున బత్తుల శ్రవణ్‌, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ సమితి తరపున గూడూరు యశోధర, బహుజన ముక్తి పార్టీ అభ్యర్థిగా నజీరుద్దీన్‌ మహమ్మద్‌, శ్రమజీవి పార్టీ తరపున మేడి రమణ నామినేషన్లు వేశారు. స్వతంత్య్ర అభ్యర్థులుగా చింతపండు నవీన్‌ (తీన్మార్‌ మల్లన్న), బండారునాగరాజు, లింగిడి వెంకటేశ్వర్లు, గుంటూరు వెంకటనారాయణ, మార్త శ్రీనివాస్‌, పూల శ్రీనివాస్‌, మాదగోని బాల నాగసైదులు, షేక్‌ షబ్బీర్‌ అలీ, బొల్గూరి కిరణ్‌, యార్ల ఆశా జ్యోతి, సురేష్‌ కొడియాల, గాలెంక విజయ్‌కుమార్‌, గడ్డం సదానందం, మారం వెంకట్‌రెడ్డి, సూరెడ్డి రమణారెడ్డి, భూక్యా కోట్య, గుగులోతు రాజునాయక్‌, దుర్గాల వెంకటేశ్వర్లు, నందిపాటి జానయ్య, గుండు సంజీవులు, ఎ. నరేందర్‌, గుత్తా రవిందర్‌రెడ్డి, ముదుడ్ల రమేష్‌, మండపూడి శివప్రసాద్‌, పెంట రమేష్‌, సంకెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కొండా రాధాకృష్ణ, మామిడి అంబేద్కర్‌, గద్దల అప్పారావు, సూదగాని హరిశంకర్‌గౌడ్‌, భారతి కూరాకుల, కౌతం రవీందర్‌, పాటి రవీందర్‌, కామె రవి, బరిగెల దుర్గాప్రసాద్‌ మహరాజ్‌, డా. కొల్లు నర్సింహారావు, అంబాల రవికుమార్‌, ఆంగోతు వీరన్న, ముంద్ర మల్లికార్జున్‌, చొల్లేటి వెంకట కృష్ణాచారి, జట్టి జైస్వామి, తెల్గమల్ల యాదయ్య, కొండ ఏడుకొండ, చిల్కు శ్రీనివాస్‌, గోనె నరేష్‌, నర్సింగ్‌ శ్రీను, సామల శశిధర్‌, అంతటి శీనయ్య, వనం శ్రీకృష్ణ, సపావత్‌ సుమన్‌, పెరుమాళ్ళ అశోక్‌రావు, గుండు ఉపేందర్‌, డి వేలాద్రి , వెంకటరమణ ముళ్లపూరి, శీలం రవిందర్‌రెడ్డి, జంపన్న కొండ, దేశబోయిన బాలస్వామి, తాళ్ళూరి సృజన్‌కుమార్‌, బెజ్జగం నాగరాజు, దూడపాల సంజీవ నామినేషన్లు సమర్పించారు. 

Updated Date - 2021-02-24T05:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising