ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశ్నించే గొంతుకను చట్టసభకు పంపాలి

ABN, First Publish Date - 2021-02-28T04:39:53+05:30

ప్రశ్నించే గొంతుకను చట్టసభకు పం పితే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు సాబీర్‌పాషా, అన్నవరపు కనకయ్య కోరారు. శనివారం వారు పినపాక, కరకగూడెం, మణుగూరు, అశ్వాపురంలో పర్యటించారు.

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు కనకయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు సాబీర్‌పాషా, కనకయ్య

జయసారథిరెడ్డి తరపున విస్తృతంగా ప్రచారం

పినపాక/ కరకగూడెం/ మణుగూరు/ అశ్వాపురం ఫిబ్రవరి 27: ప్రశ్నించే గొంతుకను చట్టసభకు పం పితే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు సాబీర్‌పాషా, అన్నవరపు కనకయ్య కోరారు. శనివారం వారు పినపాక, కరకగూడెం, మణుగూరు, అశ్వాపురంలో పర్యటించారు. వామపక్ష పార్టీలు బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథిరెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో వారు మాట్లాడారు. దొరలకు, దోపిడీదారులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వత్తాసు పలుకుతూ అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. ఉపాధి ఉద్యోగాలు లేక ప్రజలు అవస్ధలు పడుతుంటే, బంగారు తెలంగాణ అంటూ కల్లబొల్లి మాటలు చెబుతోందన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్యాచారి వామపక్షాల జిల్లా నాయకులు నిమ్మల వెంకన్న గడ్డం మనోహర్‌, వెంకన్న, నాగేశ్వరరావు, సతీష్‌. గోవర్దన్‌, రమేష్‌, పుల్లారెడ్డి, నెల్లూరి నాగేశ్వరరావు, దుర్గ్యాల సుధాకర్‌, రామ్మూర్తి, నర్సింహారావు, రమేష్‌, సతీష్‌, కొడిశాల రాములు, సత్రపల్లి సాంబశివరావు, సతీష్‌, కాంతారావు, సతీష్‌, సత్యం, నరసింహారావు, పుల్లారెడ్డి, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, శ్రీను, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T04:39:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising