ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుదర్శనశాస్ర్తి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-03-22T04:07:13+05:30

ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తిగా, ఒక ఆధ్యాపకునిగా పలువురికి మార్గదర్శంగా నిలిచిన సుదర్శన శాస్ర్తిని స్పూర్తిగా తీసుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దమ్మపేట, మార్చి 21: ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తిగా, ఒక ఆధ్యాపకునిగా పలువురికి మార్గదర్శంగా నిలిచిన సుదర్శన శాస్ర్తిని స్పూర్తిగా తీసుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్‌ అన్నారు.  దమ్మపేట ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం సుదర్శనశాస్ర్తి  సంస్మరణ సభ జరిగింది. మందుగా ఆయన చిత్ర పటం వద్ద ఎమ్మెల్యే మెచ్చా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఆయన ఉద్యోగ కాలంలో పలువురుకి సహయ సహకారాలు అందించటంతో పాటు, పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారని అన్నారు. అదే విధంగా తన తనయుడు పణీంద్ర నర్సంపేట ఏసీపీగా పనిచేస్తూ తండ్రి ఆశయాలకు తగ్గట్టుగా విఽధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆయన మనలో లేకపోయిన ఆయన భావాలు, ఆదర్శాలు ఎప్పుడూ ఆదర్శంగా తీసుకుంటామన్నారు. విశ్రాంత అధ్యాపకునిగా పలువురి ఉద్యోగులకు సేవలందించటంతో పాటు పేద పిల్లలను దత్తతగా తీసుకొని విద్యనందించి మార్గదర్శకులుగా మారానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసి పైడి వెంకటేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్‌ కేవి సత్యనారాయణ, సొసైటీ చైర్మన్‌ రావు జోగేశ్వరరావు, గారపాటి సూర్యనారాయణ, జారే ఆదినారాయణ, మార్కెట్‌ కమిటి ఉపాధ్యక్షుడు కొయ్యల అచ్యుతరావు, సీపీఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు, ఎన్‌డీ నాయకులు అమర్లపూడి రాము,  ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పలువురు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు.


Updated Date - 2021-03-22T04:07:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising