ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి పువ్వాడపై అనుచిత వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-01-12T05:04:47+05:30

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై ఖమ్మానికి చెందిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టు పెట్టాడంటూ ఖమ్మం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో బెల్లంకొండ దిలీప్‌ కుమార్‌ అనే టీఆర్‌ఎస్‌ కార్యకర్త చేసిన ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదైంది.

త్రీటౌన్‌ స్టేషన్‌ వద్ద బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన బీజేపీ కార్యకర్త 

 టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఫిర్యాదుతో కేసు నమోదు

 తప్పుడు కేసు పెట్టారంటూ బీజేపీ నిరసన

ఖమ్మం మయూరిసెంటర్‌, జనవరి 11: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై ఖమ్మానికి చెందిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టు పెట్టాడంటూ ఖమ్మం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో బెల్లంకొండ దిలీప్‌ కుమార్‌ అనే టీఆర్‌ఎస్‌ కార్యకర్త చేసిన ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదైంది. దీంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, పార్టీ జిల్లా అద్యక్షుడు గల్లా సత్యనారాయణ త్రీటౌన్‌స్టేషన్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రధాని మోదీ, రాజాసింగ్‌, బండి సంజయ్‌లపై అనుచితంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోలేదుగాని, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై పోస్టులు పెట్టారంటూ నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టడమేంటని వారు ప్రశ్నించారు. మంత్రి అజయ్‌, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తమ పట్ల మాట్లాడిన మాటలకే కార్యకర్త బదులు ఇచ్చారని వారు తెలిపారు.


Updated Date - 2021-01-12T05:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising