ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులు అరెస్టు

ABN, First Publish Date - 2021-02-24T05:12:40+05:30

ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి డిటోనేటర్లు 50, జిలెటిన్‌ స్టిక్స్‌ 50, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సునీల్‌దత్‌ తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సునీల్‌దత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

50 డిటోనేటర్లు, 50 జిలెటిన్‌ స్టిక్స్‌, విప్లవ సాహిత్యం స్వాధీనం 

వివరాలు వెల్లడించిన భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్‌ 

కొత్తగూడెం, ఫిబ్రవరి 23: ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి డిటోనేటర్లు 50, జిలెటిన్‌ స్టిక్స్‌ 50, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సునీల్‌దత్‌ తెలిపారు. కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాల యంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చర్ల పోలీస్టేషన్‌ పరిధిలో 141 బెటాలియన్‌, సీఆర్‌పీఎఫ్‌ పో లీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్ద రు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారు ఇంద్రావతి కమిటీ సభ్యులైన పద్దం మున్ని అలియాస్‌ తెల్లం మున్ని అలియాస్‌ నిర్మలతోపాటు మావోయిస్టు కొరియర్‌ జర్పుల బన్సీలుగా గుర్తించారు. వారిలో పద్దం మున్ని దండకారణ్యంలో ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలిగా వ్యవహ రిస్తున్నారు. మున్ని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా గంగులూరుకు చెందిన మహి ళకాగా ఆమె సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరారు. 2014వరకు మిలీషి యా సభ్యురాలిగా ఛత్తీస్‌గఢ్‌ ఏరియాలోని మద్దేడు ఏరియా కమిటీలో పని చేశారు. ఇటీవల ఇంద్రావతి ఏరియా కమిటీ తరపున క్రాంతికారీ మహిళా సంఘంలో 2015వరకు పని చేశారు. జర్పుల బన్సీ మద్దేడు ఏరియా కమిటీకి కొరియర్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని ఆవుపల్లి పరిధి నుంచి వచ్చి చర్ల మండలంలోని బస్టాండ్‌ ఏరియాలో పేలుడు సా మగ్రితో సంచరిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారిద్దరిపై చర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కేసు నమోదుచేసి కోర్టుకు తరలించినట్లు ఎస్పీ సునీల్‌దత్‌ వివరించారు. పేలుడు పదార్థాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ వినీత్‌, కమాండెంట్‌ ఓం ప్రకాష్‌, చర్ల సీఐ అశోక్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-02-24T05:12:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising