ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారు తెలంగాణ పేరుతో మోసం

ABN, First Publish Date - 2021-07-20T05:35:16+05:30

రాష్ట్రలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బంగారు తెలంగాణ పేరుతో వారిని మోసం చేస్తోందని మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ ఆరోపించారు.

ఆజాద్‌ పేరుతో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజలను దగా చేస్తున్న టీఆర్‌ఎస్‌ 

‘ఆజాద్‌’ పేరిట మావోయిస్టుల లేఖ విడుదల

చర్ల, జులై 19: రాష్ట్రలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బంగారు తెలంగాణ పేరుతో వారిని మోసం చేస్తోందని మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ ఆరోపించారు. ఆయన పేరిట సోమవారం చర్ల విలేకరులకు లేఖ విడుదల చేశారు. రాష్ట్రా బంగారుత తెలంగాణ చేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌ పార్టీ అప్పుల తెలంగాణగా మార్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదన్నారు. హరితహారం పేరుతో పోడుభూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు. భూములు లాక్కోవడానికి వచ్చే ఫారెస్టు, పోలీసులను తరిమి కొట్టాలన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడాలని సూచించారు. స్వాతంత్రం వచ్చి ఏడుదశాబ్దాలవుతున్నా నేటికీ ఆదివాసీల ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సామాజిక, సాంసృతిక పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి బహుళజాతి కంపెనీలతో ఒప్పదం చేసుకొని అడవులు, ఖనిజ సంపదను దోచుకోవడానికి రోడ్లు వేస్తున్నారని అరోపించారు. ఆదివాసీలకు అడవులతో వీడదీయని బంధం ఉందని, హరితహారం పేరుతో ఆ బంధాన్ని తెంచాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎదురుతిరిగితే కేసులు పెట్టి వారిని జైళ్లలో బంధిస్తున్నారని అరోపించారు. పేదల దగ్గర లాక్కున్న భూములను తిరిగి ఇవ్వాలని, ఆదివాసీ, ఇతరులపై దాడి చేసిన పోలీస్‌, పారెస్టు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-20T05:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising