ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాశివరాత్రి జాతర సన్నాహక సమావేశం

ABN, First Publish Date - 2021-02-25T04:33:04+05:30

మహాశివరాత్రి జాతరను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ధర్మకర్తలమండలి, అధికారుల సన్నాహాక సమావేశం నిర్ణయించింది.

జాతర ప్రచార వాల్‌పోస్టర్లను విడుదల చేస్తున్న ధర్మకర్తలమండలి సభ్యులు, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరా, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి జాతరను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ధర్మకర్తలమండలి, అధికారుల సన్నాహాక సమావేశం నిర్ణయించింది. మండలంలోని స్నానాల లక్ష్మీపురంలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో మార్చి 11న మహాశివరాత్రి నిర్వహణకు సంబంధించి బుధవారం ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్తలమండలి, పలుశాఖల అధికారుల సన్నాహాక సమావేశం జరిగింది. ఆలయకమిటీ అధ్యక్షుడు మోరంపూడి బాబూరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. జాతర ప్రచార వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఆలయ ఈవో హరి చంద్రశేఖర్‌, వైరా సీఐ, ఎస్‌ఐ జె.వసంతకుమార్‌, వి.సురేష్‌, ఎంపీడీవో ఎన్‌.వెంకటపతిరాజు, తహసీల్దార్‌ హళావత్‌ రంగా, డీటీ రవీందర్‌, వైరా మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.వెంకటస్వామి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ స్వామిదాసు, ఆర్‌అండ్‌బీ డీఈ చౌహాన్‌, మధిర ఆర్టీసీ డీఎం, స్నానాల లక్ష్మీపురం సర్పంచ్‌ అమ్మిక రామారావు, వైద్యఆరోగ్యశాఖ, ఐబీ తదితరశాఖల అధికారులు, ధర్మకర్తలమండలి సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.


Updated Date - 2021-02-25T04:33:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising