ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ వివాదంలో బదిలీ ఎస్‌ఐ

ABN, First Publish Date - 2021-11-23T04:41:33+05:30

భూ వివాదంలో తలదూర్చిన బదిలీ ఎస్‌ఐ ఎస్‌ఐ తోట నాగరాజుపై వీఎం బంజర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవిషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టు ఆదేశాల మేరకు ఏ-5గా కేసు నమోదు

పెనుబల్లి, నవంబరు 22 : భూ వివాదంలో తలదూర్చిన బదిలీ ఎస్‌ఐ ఎస్‌ఐ తోట నాగరాజుపై వీఎం బంజర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవిషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబం ధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్తుపల్లి పట్టణనికి చెందిన తేళ్లూరి తిరుమల రావు పెనుబల్లి మండలం మండాలపాడులో కృష్ణా జిల్లా విసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లికి చెందిన సూరా నాగేశ్వరరావుకు చెందిన  భూమి కొన్నాడు. ఆ భూమి పక్కనే మండాలపాడుకు చెందిన నన్నక సత్యానారాయణతోపాటు మరో ముగ్గురికి భూములన్నాయి. నన్నక సత్యనా రాయణ, మిగతా ముగ్గురు తిరుమలరావు భూమిని ఆక్రమించారు. ఈక్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలని జనవరి నెలలో వీఎంబంజర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, నన్నక సత్యానాయణ వర్గీయుల భూమి చుట్టూ ఎస్‌ఐ నాగరాజు దగ్గరుండి ఫెన్సింగ్‌ వేయించారు. ఈక్రమంలో తిరుమలరావు హైకోర్టు, పోలీసు ఉన్నతాధికారులను అశ్రయించాడు. కోర్టు అదేశాల మేరకు ఈనెల రెండున వీఎంబంజర్‌ స్టేషన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు నన్నక సత్యనారాయణ, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఏ-5గా ఎస్‌ఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-11-23T04:41:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising