ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండరెడ్లకు అండగా..

ABN, First Publish Date - 2021-10-10T05:40:55+05:30

కొండరెడ్లకు అండగా..

కొండరెడ్లు తయారు చేసిన వెదురు కళాకృతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెదురు అల్లికల తయారీ కేంద్రానికి రంగం సిద్ధం

అడవి బిడ్డలకు చేయూతనివ్వనున్న ఐటీడీఏ

ప్రతిపాదనలకు ఇప్పటికే కమిషనర్‌ ఆమోదం

భద్రాచలం, అక్టోబరు 9: ఏజెన్సీ ప్రాంతాల్లో వెదురు అల్లికలు, ఆకృతులను తయారు చేయడంలో కొండరెడ్లు నిష్ణాతులు.. అడవుల్లో దొరికే వెదురు బొంగుల తో వారు వివిధరూపాల్లో వెదురు ఆకృతులను తయారుచేస్తూ ఉంటారు. వాటికి మార్కెట్లో విస్తృతమైన డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో కొండరెడ్లకు ఉపాధిని కల్పించడంతోపాటు వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు భద్రాచలం ఐటీడీఏ చొరవ తీసుకుంటోంది. అందులో భాగంగా వెదురుఅల్లికలు, ఆకృతులను తయా రు చేయడంతోపాటు మిగిలిన కొండరెడ్ల యువతకు ఈ తయారీ విధానం ఉపాధిగా ఉండేలా చర్యలు చేపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కొండరెడ్ల యువత కు వెదురు అల్లికలు, ఆకృతులను తయారు చేయడం, శిక్షణ ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం ఇందుకు సంబంధించిన ప్రక్రియ గతకొంతకాలంగా నిలిచిపోయింది. జిల్లాలో సుమారు వెయ్యి మంది కొండరెడ్లు నివసిస్తుండగా వారిలోని యువతను గుర్తించివారికి వెదురు అల్లికలు, ఆకృతుల ను తయారు చేయడం, శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ విష యమై గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ క్రిస్టియానా జెడ్‌ చాంగ్తో, భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ ఆసక్తి కనబరిచి వెదురుఅల్లికల తయారీతోపాటు ఇతర కొండరెడ్ల యువతకు వెదురు అల్లికల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా భద్రాచలం ఐటీడీఏ అధికారులు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సైతం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆమోదానికి పంపారు. ఇందుకు సానుకూలంగా కమిషనర్‌ స్పందించడం తో అశ్వారావుపేట మండలం లోని గోగులపూడి, దమ్మ పేట మండలంలోని పూసుగుట్ట గ్రామాల్లోని కొండ రెడ్లకు చెందిన పది మంది యువకులను గుర్తిం చగా, వారికి ఐటీడీఏ ఆర్థిక సహకారం అందించను న్నట్టు తెలుస్తోంది. ఈ కేంద్రం ఐటీడీఏ పరిధిలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం నాయకపోడు కళాకృతుల భవనం పైభాగంలో ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2021-10-10T05:40:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising