ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల పట్ల కేసీఆర్‌ నిర్లక్ష్యధోరణి

ABN, First Publish Date - 2021-03-05T05:32:36+05:30

ఉద్యోగ, నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని టీజేఎస్‌ వ్యవస్థాపకుడు, పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం విమర్శించారు.

భద్రాచలంలో వాకర్స్‌తో కోదండరాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కోదండరాం

దుమ్ముగూడెం/ భద్రాచలం/ మణుగూరు/ బూర్గంపాడు మార్చి 4: ఉద్యోగ, నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని టీజేఎస్‌ వ్యవస్థాపకుడు, పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం విమర్శించారు. భద్రాచలం, బూ ర్గంపాడు, మణుగూరు, దుమ్ముగూడెంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఉద్యోగులకు పీఆర్‌సీ, సెలవులు అవసరమా అని వెటకారంగా మాట్లాడిన కేసీఆర్‌ వైఖరిని గుర్తించాలని కోరా రు. ఉద్యోగాల భర్తీ లెక్కలు మోసపూరితమైనవని విమర్శించారు. ఎస్టీ, ఎస్సీ సబ్‌ప్లా న్‌, బీసీ సంక్షేమాలు అన్ని అటకెక్కాయన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఐదు పంచాయతీలు తిరిగి భద్రాచలంలో విలీనమయ్యేందుకు తప్పక తాను కృషి చేస్తానని, అదేవిధంగా భద్రాద్రి అభివృద్దికి రూ.100 కోట్లు విడుదలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. కాగా కోదండరాంకు మద్దతుగా న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో షేక్‌ నబీ, శివప్రసాద్‌, బిట్రా సాయిబాబా, వీరభద్రచారి, దేవదానం, శ్రీను, సతీష్‌ పాల్గొన్నారు. ఏవీఎస్పీ నాయకులు కామరాజు, మల్లుదొర, నాగేశ్వరావు, టీజేఏసీ నాయకులు రామనాథం, శివ, సాయిలు, టీడీపీ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, నారాయణదొర, చలపతిరావు కృష్ణ, బచ్చల భారతి, సత్యనారాయణ, బాబు, బేగం, చవాలత, ప్రకాష్‌, రఘురాం,కె వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, జగదీశ్వరరావు మద్దతు తెలిపారు. సమావేశంలో నాయకులు మధుసూధన్‌రెడ్డి, కోటి పాల్గొన్నారు.  పాల్గొన్నారు.


Updated Date - 2021-03-05T05:32:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising