ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడిఖమ్మం పట్టభద్రులు.. 1,26,622

ABN, First Publish Date - 2021-01-19T05:28:42+05:30

ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు సోమవారం విడుదల చేశారు. మొత్తం పట్టభద్రుల నియోకవర్గంలో 4,91,402 మంది ఓటర్లు ఉండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,26,622 మంది ఓటేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘మండలి’ ఓటర్ల తుదిజాబితా విడుదల

మండలాల్లోనూ ప్రదర్శనకు జాబితా

ఖమ్మం జిల్లాలో 85,051, భద్రాద్రిలో 41,571మందికి ఓటు

మొత్తం నియోజకవర్గంలో 4,91,402మంది ఓటర్లు

ఖమ్మం కలెక్టరేట్‌ / ఇల్లెందు, జనవరి 18 : ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు సోమవారం విడుదల చేశారు. మొత్తం పట్టభద్రుల నియోకవర్గంలో 4,91,402 మంది ఓటర్లు ఉండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,26,622 మంది ఓటేయనున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాలో 85051మంది, భద్రాద్రి జిల్లాలో 41,571 మంది ఓటర్లున్నారు. అయితే 2015లో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మొత్తం 2,81,138మంది ఓటర్లు ఉండగా.. ఈ ఏడాదికి మండలి ఓటర్ల సంఖ్య దాదాపు రెట్టింపై.. 4,91,402కు చేరింది. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో గతేడాది డిసెంబరు 1 నాటికి 81,160 మంది ఉండగా.. మరోసారి ఓటునమోదుకు అవకాశాన్ని కల్పించడంతో.. మరో 3,891మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి అర్హులను ఎంపిక చేసిన తర్వాత.. సోమవారం తుది జాబితా విడుదల చేశారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో మొత్తం 85,051 మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు నమోదయ్యారు. అయితే జిల్లాలో ప్రస్తుతం107 పోలింగ్‌ కేంద్రాలను నిర్ణయించిన అధికారులు.. ఒక్కో కేంద్రంలో 1000 మంది చొప్పున ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అవసరమైన చోట అదనపు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 41,571 మంది ఓటర్లుగా నమోదవగా మొత్తం 52పోలింగ్‌స్టేషన్లను నిర్ణయించారు. ఇదిలా ఉంటే ములుగు జిల్లాలో 9,896మంది, సిద్దిపేటలో 3,395, నల్గొండలో 88,351, సూర్యాపేటలో60,020, భూపాలపల్లిలో 12,388, జనగామలో 20,502, యాద్రాద్రి భువనగిరిలో 37,572, మహాబూబాబాద్‌లో 35,389, వరంగల్‌ అర్బన్‌లో 64,432, వరంగల్‌ రూరల్‌లో32,835మంది ఓటర్లుగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Updated Date - 2021-01-19T05:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising