ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదురోజుల్లో 40వేలమంది.. భద్రాద్రికి పెరిగిన భక్తుల రాక

ABN, First Publish Date - 2021-01-18T04:40:10+05:30

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ విధింపు తర్వాత భద్రాచలానికి భక్తుల రాక తగ్గడం, తద్వారా దేవస్థానానికి ఆదాయం రాక కూడా తగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రస్తుతం క్రమంగా భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది.

భద్రాద్రి సీతారామచంద్రస్వామికి నిత్యకల్యాణానికి హాజరైన భక్తులు, కల్యాణ వేదికపై స్వామివారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవస్థానానికి రూ.30లక్షలకుపైగా ఆదాయం

భద్రాచలం, జనవరి 17:  కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ విధింపు తర్వాత భద్రాచలానికి భక్తుల రాక తగ్గడం, తద్వారా దేవస్థానానికి ఆదాయం రాక కూడా తగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రస్తుతం క్రమంగా భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. గత ఐదు రోజులుగా 40వేల మంది రామయ్యను దర్శించుకోగా దేవస్థానానికి రూ.30లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ఆదివారం రామయ్యకు నిర్వహించిన మూలవరుల అభిషేకం, సువర్ణ పుష్పపూజ, నిత్యకల్యాణాల్లోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు(ఐఎఫ్‌ఎస్‌) ఎన్‌.నాగేశ్వరరావు రామయ్యను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రామాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన్‌, చింతూరు అటవీశాఖ సూపరింటెండెంట్‌ అమరవాది సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు. 

రూ.6లక్షల హారాలను సమర్పించిన రాజమండ్రి భక్తులు

భద్రాద్రి రామయ్యకు ఏపీలోని రాజమండ్రికి చెందిన వీవీవీఎస్‌ చౌదరి, అమ్మాజీ దంపతులు 30గ్రాముల గుండ్ల హారం, 28 గ్రాముల నెక్లెస్‌, 20 గ్రాములు, 15 గ్రాముల ముత్యాలహారాలు సమర్పించారు. వాటి విలువ రూ.6లక్షలు ఉంటుందని అంచనా. వీటిని దేవస్థానం ఈవో బి.శివాజీకి అందజేయగా.. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-18T04:40:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising