ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారిని చిదిమేసిన ఉయ్యాల

ABN, First Publish Date - 2021-04-21T05:04:53+05:30

అప్పటి వరకు తల్లిచేతి గోరుముద్దలు తింటూ ఆనందిస్తున్న చిన్నారిని రెప్పపాటు ఏమరపాటులో ఉయ్యాల రూపంలో మృత్యువు కబళించింది. అన్నం పెడుతూ తాగునీళ్లు తీసుకొచ్చేందుకు తల్లి లోపలికి వెళ్లి తిరిగి వచ్చేలోపు నిమిషాల వ్యవధిలోనే ఉయ్యాల రూపంలో ఓ చిన్నారిని మృత్యువు మింగేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెడకు చీర చుట్టుకుని ఆరేళ్ల బాలుడు మృతి

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో విషాధం 

అశ్వారావుపేట, ఏప్రిల్‌ 20: అప్పటి వరకు తల్లిచేతి గోరుముద్దలు తింటూ ఆనందిస్తున్న చిన్నారిని రెప్పపాటు ఏమరపాటులో ఉయ్యాల రూపంలో మృత్యువు కబళించింది. అన్నం పెడుతూ తాగునీళ్లు తీసుకొచ్చేందుకు తల్లి లోపలికి వెళ్లి తిరిగి వచ్చేలోపు నిమిషాల వ్యవధిలోనే ఉయ్యాల రూపంలో ఓ చిన్నారిని మృత్యువు మింగేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అశ్వారావుపేట యూనియన్‌ బ్యాంకులో పనిచేసే రవికుమార్‌ కుటుంబం బస్టాండ్‌ వెనుక ప్రాంతంలో ని వాసముంటోంది. రవికుమార్‌కు ఇద్దరు మగ పిల్లలు ఉండగా మంగళవారం మధ్యాహ్నం రవికుమార్‌ భార్య నందిని ఆ చిన్నారులకు భోజనం పెట్టింది. ఈ క్రమంలో పిల్లలకు తాగునీళ్ల కోసం ఇంటిలోపలకు వెళ్లగా ఆ సమయంలో ఉయ్యాలలో ఆడుకుంటున్న పెద్దకుమారుడు సాహంత్‌(6) జారి కిందపడ్డాడు. ఈ క్రమంలో ఉయ్యాలకోసం వేసిన చీర మెడకు చుట్టుకుంది. నీళ్లకోసం ఇంట్లోకి వెళ్లి వచ్చిన నందినికి సాహంత్‌ మొడకు చీర చుట్టుకొని కొట్టుకుంటూ కనపడ్డాడు. ఇది చూసిన నందిని బోరున విలపిస్తూ కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు వచ్చి చీరెను తొలగించి చిన్నారిని బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-21T05:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising