ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మం జిల్లాలో ‘అడుగు’ల కలకలం..

ABN, First Publish Date - 2021-10-08T17:43:35+05:30

ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల మండలాల్లోని పలు గ్రామాల్లోని పొలాల్లో పులి సంచరించిందన్న ప్రచారంతో రైతులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. బుధ, గురువారాల్లో వైరా మండలం రెబ్బవరం, జింకలగూడెం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

             - అవి పులివా... తోడేలువా

             - వైరా, కొణిజర్ల పొలాల్లో సంచరించిందని ప్రచారం

             - ఆందోళన చెందిన రైతులు.. 


వైరా/కొణిజర్ల: ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల మండలాల్లోని పలు గ్రామాల్లోని పొలాల్లో పులి సంచరించిందన్న ప్రచారంతో రైతులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. బుధ, గురువారాల్లో వైరా మండలం రెబ్బవరం, జింకలగూడెం కొణిజర్ల మండలంలోని కాచారం, సీతారాంపురం తదితర గ్రామాల్లోని పంట పొలాల్లో పులి సంచరించిందని దానికి సంబంధించిన పాద ముద్రాలు ఉన్నాయన్న చర్చ జరిగింది. బుధవారం సాయంత్రం రైతులు పొలాల్లో పనులు చేసుకుంటున్న సమయంలో పులి చారలు కలిగిన జంతువు కనిపించి వారి వెంట పడిందని దాంతో అక్కడి నుండి పారిపోయారని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ తల్లాడ రేంజ్‌ అధికారి అరవింద్‌కు రైతులు సమాచారం ఇవ్వడంతో.. బీట్‌ అధికారులు సురేష్‌, రాంబాబు, బీమ్లా రెబ్బవరం, జింకల గూడెం పొలాలను సందర్శించారు. జంతువు పాద ముద్రలను సేకరించారు. తర్వాత రేంజ్‌ అధికారి వాటిని నివేదించారు. ఆ పాద ముద్రలు తోడేలు జాతికి చెందిన జంతువుదని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వైరా, కొణిజర్ల ప్రాంతాల్లో పులి సంచరించే అవకాశం లేదని ప్రజలు ఎలాంటి భయభ్రంతులకు లోనవద్దని స్పష్టం చేశారు. పులి పాద ముద్రలు 10సెంటీమీటర్ల వరకు ఉంటాయని ప్రస్తుతం సేకరించిన పాద ముద్రాలు 4, 5 సెంటీ మీటర్ల సైజులో ఉన్నాయని తెలిపారు. కల్లూరు ప్రాంతం నుంచి వచ్చిన తోడేలుజాతి జంతువు సంచరించి ఉంటుందని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-08T17:43:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising