ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామ్మో.. ‘గూడెం’ మునిసిపాలిటీనా..?

ABN, First Publish Date - 2021-07-23T04:25:52+05:30

ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకులు, ప్రభుత్వంచే నియమించిన అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులు నిర్వహించాల్సిన పురపాలకంలో రాజకీయ పెత్తనం కొనసాగుతుంది.

కొత్తగూడెం మునిసిపల్‌ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విధులు నిర్వహించేందుకు జంకుతున్న ఉద్యోగులు

కొత్తగూడెం టౌన్‌, జూలై 22: ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకులు, ప్రభుత్వంచే నియమించిన అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులు నిర్వహించాల్సిన పురపాలకంలో రాజకీయ పెత్తనం కొనసాగుతుంది. దీంతో అధికారులు పనిచేసేందుకు విముఖత చూపుతున్నారు. ప్రతి అంశంలోను అధికారులపై పాలకులు పెత్తనం కొన సాగించడంతో అధికార యంత్రాంగం భీతిల్లుతోంది. ఎలాం టి పదవులు లేకున్న షాడో ఇజం నిర్వహిస్తూ అధికారు లను బెంబేలెత్తించడం ఇక్కడ ప్రధాన అంశం. జిల్లా కేంద్రం, ప్రధమశ్రేణి మునిసిపాలిటీ కొత్తగూడెంను పరిశీ లిస్తే ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులను పాలకుల అండతో ప్రజాప్రతినిఽధి శాసిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. అధికారులు నిబద్దతతో విధులు నిర్వర్తించడం లే దని, పాలకులు, రాజకీయ నాయకుల సూచనలను బేఖా తర్‌ చేస్తున్నారనే నెపంతో సరెండర్‌, సస్పెండ్‌ చేయిస్తూ క క్షసాధింపు ధోరణికి పాల్పడుతున్నా రనే అపవాదును మూ టకట్టుకున్నారు. పురపాలక అధికారులు వచ్చినవారు చా లావరకు డిప్యూటేషన్‌పై ఇతర మునిసిపాలిటీలకు వేళ్లేం దుకు ఎందుకు అశక్తి చూపుతు న్నారో అంతుచిక్కడం లే దు. అయితే అధికారులు స్వతం త్రంగా రాజకీయాల కతీతంగా వ్యవహరించకపోవడం ఓ కారణంగా తెలుస్తోం ది. దీనికి తోడు స్థానికంగా ఉండే కీలకమైన ప్రజాప్రతిని ధులతో పాటు ఆయా పార్టీలలో ఉన్న ముఖ్య నాయకు లను గమనంలోకి తీసుకోకుండా ఏదో ఒక రాజకీయ నా యకులకు(ప్రజాప్రతినిధులకు) అనుకూలంగా  వ్యవహరి స్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించకపోవడంతో ఇటు ప్ర జలతోనూ ఒత్తిళ్లను ఎదుర్కోవలసి వస్తోంది. దీంతో ఇక్కడ పనిచేయాలంటే ముందుకు వెళితే గొయ్యి... వెనక్కి వెళితే నుయ్యి అనే సామెత చందాన ఉంది. ఉద్యోగులు సైతం అవకాశాన్ని బట్టి రాజకీయ నాయకుల చంకన చేరటం, పాలకులు సైతం వీరిని వెనకేసుకురావడం ఇక్కడి మునిసి పాలిటీలో సర్వసాధారణంగా కనిపిస్తోంది.  గత కొంతకా లంగా అధిపత్య పోరుతో ముని సిపాలిటీ చుట్టూ రాజకీ యాలు నడుస్తున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ఇక్కడే ఉండటంతో మునిసిపాలిటీపై ఆధిపత్యంలో తమదే పైచే యిగా ఉండాలనే తాపత్రయం నడుస్తోంది. ఇటు ప్రతి పక్షం అటు అధికార పక్షం వారు మునిసిపాలిటీ రాజకీ యాలు తమ గుప్పిట్లో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నా రనే ప్రచారం కూడా ఉంది. రాష్ట్రంలో ఎవరి పార్టీ అధికా రంలో ఉంటే వారికి నచ్చిన అధికారులను ఇక్కడికి తెచ్చు కుంటారు. దీంతో అధికారులు కూడా అదే పార్టీ వారికి కొం త సానుకూలంగా ఉండటం, వారి పనులకు ఎక్కువ ప్రా ధాన్యత ఇవ్వడం లాంటి సమస్యలు తలెత్తి వివాదస్పదం గా మారుతున్నాయి. అధికారపక్షం వారిలోని ఆధిపత్య పోరుతో ఇక్కడ పనిచేసే అధికారులకు ఇబ్బందులు తప్పటం లేదు. 


Updated Date - 2021-07-23T04:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising