ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌వార్డు విభాగానికి వెళ్లాలంటే నరకమే

ABN, First Publish Date - 2021-06-19T05:05:57+05:30

ఇన్‌వార్డు విభాగం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఎంతో కీలకమైనది.

కొత్త ఇన్‌వార్డుకు వెళ్లే మెట్లదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మెట్లు ఎక్కలేక పడుతున్న వృద్ధులు

ఖమ్మం కార్పోరేషన్‌, జూన్‌ 18: ఇన్‌వార్డు విభాగం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఎంతో కీలకమైనది. ఎటువంటి దరఖాస్తు అయినా ఈ విభాగంలో ఆన్‌లైన్‌ అవుతేనే సంబంధిత అధికారి వద్దకు వెళుతుంది. అటువంటి ఇన్‌వార్డు విభాగానికి వెళ్లాలంటే నరకం కనబడుతుంది. ఎంతో కీలకమై, ప్రతిరోజు భారీసంఖ్యలో దరఖాస్తులు వచ్చే విభాగాన్ని పైఅంతస్తులో ఉంచటంతో మెట్లు ఎక్కి వెళ్లేందుకు వృద్ధులు, మహిళలు ఎంతో ప్రయాసపడుతున్నారు. అయితే గతంలో పాత భవనంలో  ఉన్న ఇన్‌వార్డు విబాగాన్ని, మేయర్‌ ఛాంబర్‌ పై అంతస్తులో ఏర్పాటు చేశారు. అయితే అక్కడ, ఇక్కడా మెట్లు ఎక్కి విభాగానికి వెళ్లటం దరఖాస్తుదారులకు నరకప్రాయమైంది.


విభాగం మార్పు తెలియక


ఇన్‌వార్డు విభాగం మార్చారని చాలా మందికి తెలియదు. దీంతో ఎంతో ప్రయాసపడి మెట్లు ఎక్కి పాత భవనంలోకి వెళ్లి ఇన్‌వార్డు విభాగం మార్చారని, అక్కడివారు చెప్పటంతో ఉసూరుమంటూ మెట్లు దిగివస్తున్నారు. తరువాత ప్రస్తుతం ఉన్న విభాగానికి వెళ్లాలంటే మళ్లీ మెట్లు ఎక్కాల్సిరావటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనులకు దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చే వృద్ధులు తీవ్ర ప్రయాసపడుతున్నారు. రెయిలింగ్‌ను పట్టుకొని మెట్లు ఎక్కుతున్నారు. కొంతమంది మెట్లు ఎక్కలేక కిందపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తాము పడుతున్న ఇబ్బందులు గమనించి, ఇన్‌వార్డు విభాగాన్ని కిందకు మార్చాలని ధరఖాస్తుదారులు కోరుతున్నారు. 


Updated Date - 2021-06-19T05:05:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising