ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రి దేవస్థానంలో అంతర్గత బదిలీలు

ABN, First Publish Date - 2021-09-19T05:03:58+05:30

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అంతర్గత బదిలీలు జరిగాయి. దేవస్థానంలోని 14మంది సిబ్బందిని వివిధ విభాగాలకు బదిలీలు చేయడంతో పాటు మరి కొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శనివారం దేవస్థానం ఈవో బి.శివాజీ ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తర్వులు జారీ చేసిన భద్రాద్రి ఈవో బి.శివాజీ

భద్రాచలం, సెప్టెంబరు 18: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అంతర్గత బదిలీలు జరిగాయి. దేవస్థానంలోని 14మంది సిబ్బందిని వివిధ విభాగాలకు బదిలీలు చేయడంతో పాటు మరి కొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శనివారం దేవస్థానం ఈవో బి.శివాజీ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షకులు కె.నిరంజన్‌కుమార్‌కు ఎస్టాబ్లిష్‌మెంటు, సిబ్బంది జీతాలు, ఆడిట్‌, మేజర్‌ ఫెస్టివల్స్‌, ల్యాండ్స్‌, లీజెస్‌, లీగల్‌ మ్యాటర్స్‌, మనీవాలీడ్‌ , స్టేషనరీ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అలాగే మరో పర్యవేక్షకుడు లింగాల సాయిబాబాకు  ప్రొవిజన్‌ స్టోర్స్‌ నిర్వహణ, పర్యవేక్షణ, ప్రసాదాల తయారీ విభాగాన్ని ఇకపై పర్యవేక్షించనున్నారు. మరో పర్యవేక్షకుడు బి.కిషోర్‌కు జనరల్‌, ఈఎంవో, రికార్డు రూం, డిస్పాచ్‌, సీఆర్‌వో ఇన్‌చార్జ్‌, పర్యవేక్షణ, శాశ్వత అన్నదానం, పూజలు, అన్నదానం, కల్యాణకట్ట, పర్ణశాల ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అలాగే జూనియర్‌ అసిస్టెంట్‌ జె.రాముకు ప్రొవిజన్‌ స్టోర్స్‌లో ప్రసాదాల తయారీ విభాగం బాధ్యతలు అప్పగించారు. రికార్డు అసిస్టెంటు రాముకు మనీ వాలీడ్‌, స్టేషనరీ విభాగంనుంచి ఆలయ పరిశీలకులుగా విధులు కేటాయించారు. మరో తొమ్మిది మంది నాలుగో తరగతి ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఇతర విభాగాల పర్యవేక్షకులకు సహాయకులుగా బాధ్యతలు అప్పగిస్తూ బదిలీ చేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన సిబ్బంది వెంటనే రిపోర్టు చేయాలని సంబంధిత చార్జ్‌ లిస్టులను కార్యాలయానికి అందజేయాలని తెలిపారు. దేవస్థానంలో తాజాగా జరిగిన అంతర్గత బదిలీలు  చర్చనీయాంశంగా మారాయి. ఒక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ కీలక ఉద్యోగిని మార్పు చేసేందుకే ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది.  

Updated Date - 2021-09-19T05:03:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising