ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామదీపిక అక్రమాలపై విచారణ

ABN, First Publish Date - 2021-10-19T05:06:02+05:30

మండలంలోని టీఎల్‌పేట అంబేద్కర్‌నగర్‌ కాలనీకి చెందిన గ్రామదీపిక అక్రమాలపై సోమవారం జిల్లా అధికారులు విచారణ కొనసాగించారు.

డ్వాక్రా మహిళలతో మాట్లాడుతున్న అడిషనల్‌ పీడీ జయశ్రీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం

డీఆర్‌డీవో అడిషనల్‌ పీడీ జయశ్రీ

ఏన్కూరు, అక్టోబరు 18: మండలంలోని టీఎల్‌పేట అంబేద్కర్‌నగర్‌ కాలనీకి చెందిన గ్రామదీపిక అక్రమాలపై సోమవారం జిల్లా అధికారులు విచారణ కొనసాగించారు. అధికారుల ఎదుట డ్వాక్రా మహిళలు తమ గోడును వివరించారు. తాము స్త్రీనిధిలో ప్రతినెలా రుణాలు చెల్లిస్తున్నామని అయితే కొన్నినెలల నుంచి తాము సకాలంలో రుణాలు చెల్లిస్తున్నప్పటికీ గ్రామదీపిక ఆడబ్బులను బ్యాంకులో జమచేయకుండా సొంతానికి వాడుకుందని, ఆమెపై పూర్తిస్థాయి విచారణ జరిపి గ్రామదీపిక పదవి నుంచి తొలగించాలని డ్వాక్రా మహిళలు జిల్లా అధికారులను కోరారు. గ్రామదీపిక రూ.7.63లక్షలను సొంతానికి వాడుకొని జిల్లా నుంచి ఆడిట్‌ అధికారులు వస్తున్న సంగతి తెలుసుకొని గతనెల 30న రూ.3.50లక్షలు బ్యాంకులో జమచేసిందని, మిగతా రూ.4.13లక్షలు బ్యాంకులో జమచేయలేదని విచారణలో తేలింది. వీటిని గ్రామదీపిక నుంచి రెండురోజుల్లో రికవరీ చేస్తామని, ఆమెపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని డీఆర్‌డీవో అడిషనల్‌ పీడీ జయశ్రీ, స్త్రీనిధి రీజనల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు డ్వాక్రా మహిళలకు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం హరినారాయణ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-19T05:06:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising