ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిసెస్‌ ఇండియా రన్నరప్‌ ఫర్హాకు ఘనసన్మానం

ABN, First Publish Date - 2021-02-24T05:04:28+05:30

అహ్మదాబాద్‌ కేంద్రంగా జరిగిన ‘వీపీఆర్‌ ఎంఆర్‌ఎస్‌’ ఇండియా సీజన్‌-2 పోటీల్లో ఖమ్మం నగరానికి చెందిన మహ్మద్‌ ఫర్హా మిసెస్‌ ఇండియా ఫొటోజెనిక్‌ విభాగంలో మొదటి రన్నరప్‌గా నిలిచారు.

క్రికెట్‌అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఫర్హాను సన్మానిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం

ఖమ్మం ఖానాపురం హవేలి, ఫిబ్రవరి 23: అహ్మదాబాద్‌ కేంద్రంగా జరిగిన ‘వీపీఆర్‌ ఎంఆర్‌ఎస్‌’ ఇండియా సీజన్‌-2 పోటీల్లో ఖమ్మం నగరానికి చెందిన మహ్మద్‌ ఫర్హా మిసెస్‌ ఇండియా ఫొటోజెనిక్‌ విభాగంలో మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం ఖమ్మం చేరుకున్న ఆమెకు ఖమ్మం క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సర్దార్‌పటేల్‌ స్టేడియంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌డీవో పరంధామిరెడ్డి, ఖమ్మం టుటౌన్‌ సీఐ తుమ్మ గోపి, ప్రముఖ వైద్యుడు కూరపాటి ప్రదీప్‌కుమార్‌, అథ్లెటిక్స్‌ కోచ్‌ గౌస్‌, మతిన్‌ తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఫర్హా మాట్లాడుతూ తన భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని, తనకు ఎంతో ఆనందంగా ఉందని పర్హా పేర్కొన్నారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం పోరాటమే తన ధ్యేయమని, సమాజసేవలో తాను ముందుంటానని తెలిపారు. అయితే ఈ పోటీ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 912మంది వివాహితలకు ఆడిషన్‌ జరగ్గా.. 41మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. వారిలో ఖమ్మానికి చెందిన ఫర్హా ఎంపికవగా.. ఈనెల 21న జరిగిన ఫైనల్‌లో ఆమె మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఆమె గతంలో హ్యూమన్‌రైట్స్‌ సోషల్‌ జస్టిస్‌ మిషన్స్‌ ఉమెన్‌ ఎంప్లాయిమెంట్‌కు జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 


Updated Date - 2021-02-24T05:04:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising