ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధికి అందరూ సహకరించాలి: ఎమ్మెల్యే రాములు నాయక్‌

ABN, First Publish Date - 2021-04-21T05:12:32+05:30

మండలాన్ని అభివృద్ధి చేసే విషయంలో నాయకులు పార్టీలకు అతీతంగా సహకరిం చాలని,

జూలూరుపాడులో కళ్యాణలక్ష్మీ చెక్కును అందజేస్తున్న వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూలూరుపాడు, ఏప్రిల్‌ 20: మండలాన్ని అభివృద్ధి చేసే విషయంలో నాయకులు పార్టీలకు అతీతంగా సహకరిం చాలని, ఎలాంటి ద్వేషజాలాలకు వెళ్లవద్దు అని వైరా ఎమ్మె ల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం రూ. 32 లక్షల చెక్కు లను మంజూరు చేసింది. మంగళవారం స్థానిక తహసీ ల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మె ల్యే పాల్గొని లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా జూలూరుపాడులోని ప్రభుత్వ ఆసుప త్రిలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, ఆయన సతీమణి రాం బాయి కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కేసీఆర్‌ కిట్‌ను ఎమ్మెల్యే మహిళకు అందజేశారు. అనంతరం ఆ యన మా ట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పేదల కోసం అనేక స టంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని, నిరుపేదలందరికి అవి అందే లా అధికారులు, ప్రజా ప్రతినిఽధులు కృషి చే యాలని కోరా రు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కా న్పులు చేయిం చుకోవాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ వే యించుకునే విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దు అని, నిర్భయంగా టీకాలు వేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోనీ, జెడ్పీటీసీ భూక్యా కళావతి, తహసీల్దార్‌ లూదర్‌ విల్సన్‌, ఎంపీడీవో చంద్రశేఖర్‌, వైద్యాధికారి వీరబాబు, సీహెచ్‌వో వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు పెం డ్యాల రాజశేఖర్‌, దుద్దుకూరి మధుసుధన్‌రావు, బాణోత్‌ నీ ల, సర్పంచ్‌ పద్మ పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-21T05:12:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising