‘దేశం’ యువనేతకు ఘనస్వాగతం
ABN, First Publish Date - 2021-09-01T04:52:04+05:30
ఏపీలోని పోలవరం ముంపు మండలాల పర్యటనకు వెళ్లేందుకు గాను మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న టీడీపీ యువనేత నారా లోకేష్
ప్రత్యేక పూజల అనంతరం పోలవరం ముంపు మండలాల పర్యటనకు..
భద్రాచలం/కూసుమంచి, ఆగస్టు 31 : ఏపీలోని పోలవరం ముంపు మండలాల పర్యటనకు వెళ్లేందుకు గాను మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తొలుత ఖమ్మం జిల్లా సరిహద్దు అయిన కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద టీడీపీ, తెలుగుయువత జిల్లా నాయకులు ఆయన ఘనస్వాగతం పలికారు. అనంతరం భద్రాద్రి జిల్లా జూలూరుపాడు, పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో నాయకులు స్వాగతం పలికారు. భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో నాయకులు ఘన స్వాగతం పలకగా.. అక్కడి నుంచి వంద కార్లతో ర్యాలీగా లోకేష్ భద్రాచలం చేరుకున్నారు. అయితే భద్రాచలం చేరుకున్న లోకేష్‌ను స్థానిక శాసన సభ్యుడు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు పొదెం వీరయ్య మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ క్రమంలో లోకేష్, ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో కలిసి భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. లోకేష్ వెంట టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, టీడీపీ మహబూబూబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కొండపల్లి రామచంద్రరావు, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు కాపా కృష్ణమోహన, ఏపీ మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్సీలు పెందుర్తి వెంకటేష్, సుధారాణి, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, తెలుగుయువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాంచందర్, టీడీపీ ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు కొడాలి శ్రీనివాసన, కుంచాల రాజారాం, కంభంపాటి సురేష్ కుమార్, ఎస్కే అజీం, కోనేరు రాము, అబ్బినేని శ్రీనివాసరావు, తాతా సీత ఉన్నారు. ఇక నాయకన్‌గూడెం వద్ద స్వాగతం పలికిన వారిలో ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు, రాష్ట్రకార్యదర్శి శ్రీనివాస్, నాయకులు గుత్తాసీతయ్య, రజని, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు నల్లమల రంజిత్, తదితరులున్నారు.
ఆ ఇద్దరూ కూర్చుంటే ‘పంచాయతీ’కి పరిష్కారం
పోలవరం ముంపు గ్రామాల అంశంపై నారా లోకేష్
ఏడేళ్లుగా ఉన్న పోలవరం ముంపు మండలాల పరిధిలోని ఆ ఐదు విలీన పంచాయతీల సమస్యకు తెలుగు రాషా్ట్రల సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్టు టీడీపీ యువనేత నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఏపీలోని పోలవరం ముంపు మండలాల పర్యటనకు వెళ్లే క్రమంలో మంగళవారం ఉదయం భద్రాచలం వచ్చిన ఆయన తొలుత సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. సీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లోకేష్‌కు వేదపండితులు ఆశీర్వచనం పలికారు. దేవస్థానం తరపున ఈవో బి.శివాజీ జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు విలేకరులతో మాట్లాడిన ఆయన.. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఉందని, కరోనా నుంచి దేశ ప్రజలందరికీ విముక్తి కలిగించాలని, తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భద్రాద్రి రామయ్యను కోరుకున్నానన్నారు. అనంతరం లోకేష్ ముంపు మండలాల పర్యటనకు తరలివెళ్లారు.
Updated Date - 2021-09-01T04:52:04+05:30 IST