ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకాలు తీసుకున్నారా?

ABN, First Publish Date - 2021-10-29T05:36:53+05:30

మునిసిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌సురభి ఇంటింటికీ తిరుగుతూ కొవిడ్‌ టీకాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. టీకాలు తీసుకోనివారిని వెంటనే వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.

ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సినేషన్‌పై వివరాలు అడుగుతున్న కమిషనర్‌ ఆదర్శ్‌సురభి,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటింటికీ తిరిగి వివరాలు తెలుసుకున్న నగరపాలక కమిషనర్‌ సురభి

ఖమ్మం కార్పోరేషన్‌, అక్టోబరు28: మునిసిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌సురభి ఇంటింటికీ తిరుగుతూ కొవిడ్‌ టీకాలపై ప్రజలను అప్రమత్తం చేశారు.  టీకాలు తీసుకోనివారిని వెంటనే వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ మొదటి, రెండు డోసులను ఖచ్చితంగా తీసుకోవాలని కోరారు, అనంతరం నగరంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాలను సందర్శించారు. రిజిస్టర్‌లలో  పమోదు చేసిన వ్యాక్సిన్‌ వేసుకున్న వారి వివరాలను పరిశీలించారు. సదరు కేంద్రం పరిధిలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు, ఎంత వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది తదితర వివరాలను వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

నగరపాలక సంస్థ కార్యాలయంలో వివరాల  సేకరణ

నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లతో  టీకాలు తీసుకోని వారి వివరాలను సేకరిస్తున్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరపాలకసంస్థ  జాబితాను అనుసరించి, రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోని వారికి ఫోన్లు చేస్తున్నారు. సీనియర్‌ వాలంటీర్లు గోపిరాజ్‌, అరుణ్‌,శేఖర్‌, కిషోర్‌, సంధ్య, మేఘన, హరి ఆధ్వర్యంలో 50 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వాటంటీర్లు ఫోన్ల ద్వారా వివరాలు తీసుకొని, వారికి అవగాహన కల్పిస్తున్నారు. మొత్తం 5రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Updated Date - 2021-10-29T05:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising