సర్జరీ చేసి గర్భసంచి తొలగించి..
ABN, First Publish Date - 2021-08-04T04:41:03+05:30
ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలింతను సమయస్పూర్తితో సర్జరీ చేసి ప్రాణాలను కాపాడిన కొత్తగూడెం జిల్లా ఆస్పత్రి సూపరిండిండెంట్ డాక్టర్ సరళాను శభాష్ అనక తప్పదు.
ప్రాణాలను కాపాడిన వైద్యులు
కొత్తగూడెం కలెక్టరేట్ ఆగస్టు 3: ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలింతను సమయస్పూర్తితో సర్జరీ చేసి ప్రాణాలను కాపాడిన కొత్తగూడెం జిల్లా ఆస్పత్రి సూపరిండిండెంట్ డాక్టర్ సరళాను శభాష్ అనక తప్పదు. సోమవారం రాత్రి వైద్య బృందంతో ఐక్యంగా శ్రమించి నిండు ప్రాణాన్ని కాపాడిన వైనం జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకొంది. ప్రాణాలపై ఆశలు వదిలిన బంధువులకు ధైర్యం చెప్పి మానవ ప్రయత్నం చేసి ప్రాణాలను కాపాడిన వైద్యులను దైవంతో కొలి చారు రోగి బందువులు. అశ్వారావుపేట మండలం ఆస్పాక గ్రామానికి చెం ది న అర్రెపల్లి సంధ్య తొలికాన్పు నిమిత్తం పాల్వంచ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఈనెల 2వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు ఆపరేషన్ చేసి పురుడుపోశారు. పండంటి మగ బిడ్డను ప్రసవించారు. ఆ సంతోషం క్షణాలముచ్చటే అయింది.. సర్జరీ అయిన తర్వాత రెండు గంటల నుంచి అధిక రక్తశ్రావం కావడం, బీపీ పడిపోవడంతో పరిస్థితి విషమించింది. రాత్రి 11 గంటలకు మెరుగైన వైద్య నిమిత్తం కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో పేషంట్ పరిస్థితి ప్రాణాపాయస్థితిలో ఉంది. సుమారు ఆరు గ్రాముల రక్త పోయి కేవలం మూడు గ్రామల రక్తం మాత్రమే పేషెంట్‌కు ఉండటం, బీపీ పడిపోవడంతో పరిస్థితిని గమనించిన డాక్టర్ సరళా విషయాన్ని బంధువులకు చెప్పిం విధిలేని పరిస్థితిలో గర్భసంచి తొలగించాల్సి వస్తుందని తెలిపారు. బంధువులు అంగీకరించడంవతో రాత్రి 12 గంటలకు సర్జరీ చేపట్టి సుమారు మూడు గంటల పాటు ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించి పెద్ద ప్రాణాన్ని కాపాడారు. ఒకవైపు రక్తం ఎక్కిస్తూ మరోవైపు ఆపరేషన్ చేస్తూ వైద్య బృందం టీమ్ వర్క్ చేయడంతో ప్రాణాలను కాపాడగలిగారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ స్వప్న, డాక్టర్ మినిమ, భారతి సిస్టర్, బ్లడ్ బ్యాంక్ రమేష్ ఉమ్మడి శ్రమ ఫలితంగా ఆపరే షన్ విజయవంతం అయి ప్రాణాలతో బయటపడ్డారు.
Updated Date - 2021-08-04T04:41:03+05:30 IST