ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ సాధనతో మంచి ఫలితాలు దక్కాయి

ABN, First Publish Date - 2021-10-29T05:34:49+05:30

తెలంగాణ సాధించుకోవడంతో ప్రజలు మంచి ఫలితాలు పొందారని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి అన్నారు.

కల్లూరులో మాట్లాడుతున్న నూకల నరె్‌షరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్‌రెడ్డి

కల్లూరు, అక్టోబరు 28: తెలంగాణ సాధించుకోవడంతో ప్రజలు మంచి ఫలితాలు పొందారని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి అన్నారు. గురువారం కల్లూరులో నియోజకవకవర్గ స్థాయిలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ పోరాట పటిమతో రాష్ట్రం సాధించుకున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. టీఆర్‌ఎస్‌ కమిటీలు ఎన్నికల వరకు ఉండే అవకాశం ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో 60లక్షల సభ్యత్వాలు కలిగిఉందన్నారు. సభ్యత్వ నమోదులో జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పార్టీ అధికారంలోకి వచ్చేలా పార్టీ కార్యకర్తలు కృషిచేయాలన్నారు. విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. నవంబరు 15న వరంగల్‌లో జరగనున్న విజయోత్సవభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయాల వెంకటశేషగిరిరావు, కల్లూరు,తల్లాడ పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు, కనగాల వెంకటరావు, యాగంటి శ్రీనివాసరావు, రఫీ, పాలవెంకటరెడ్డి, వీరమోహనరెడ్డి,ఎంపీపీలు బీరవల్లి రఘు, పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీలు కట్టా అజయ్‌కుమార్‌, చెక్కిలాల మోహన్‌రావు, ఏఎంసీ చైర్యన్‌ చెక్కిలాల లక్ష్మణరావు, సీడీసీ చైర్మన్‌ ముక్కర భూపాలరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ బోబోలు లక్ష్మణరావు, ఆపార్టీనాయకులు కొరకొప్పు ప్రసాద్‌, దేవరపల్లి భాస్కరరావు, నీలాద్రిఆలయ చైర్మన్‌ పసుమర్తి వెంకలేశ్వరరావు, రైతు బంధు ప్రతినిధులు పసుమర్తి చందర్‌రావు, డాక్టర్‌ లక్కినేని రఘు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-29T05:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising