ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పాపికొండల్లో.. ఎట్టకేలకు గోదావరి విహారయాత్రకు మోక్షం

ABN, First Publish Date - 2021-10-29T06:34:21+05:30

యావత్‌ పర్యాటకులను ఆకట్టుకునే పాపికొండల పర్యాటక బోటు విహారయాత్ర ఎట్టకేలకు పునఃప్రారంభం కానుంది. 2019 సెప్టెంబరు 15న తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో బోటు ప్రమా దం జరిగిన అనంతరం ఈ విహారయాత్ర నిలిచిపోయింది.

పాపికొండల విహారయాత్రకు సిద్ధమవుతున్న బోటు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 7 నుంచి లాంచీల పునఃప్రారంభం

 కఠిన నిబంధనలు, మార్గదర్శకాలు

 బోట్‌ ఆపరేటర్లతో ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌

భద్రాచలం, అక్టోబరు 28: యావత్‌ పర్యాటకులను ఆకట్టుకునే పాపికొండల పర్యాటక బోటు విహారయాత్ర ఎట్టకేలకు పునఃప్రారంభం కానుంది. 2019 సెప్టెంబరు 15న తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో బోటు ప్రమా దం జరిగిన అనంతరం ఈ విహారయాత్ర నిలిచిపోయింది. ఈ క్రమంలో 25నెలల సుదీర్ఘ విరామం తరువాత నవం బరు ఏడో తేదీ నుంచి ఈ పర్యాటక యాత్ర మళ్లీ ప్రారంభంకానున్నట్టు ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. పర్యా టక రంగానికి ప్రోత్సాహంతో పాటు పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాల ద్వారా బోట్లను నడపనున్నారు. ఇదే సమయంలో బోట్‌ ఆపరేటర్లతో ప్రత్యేక వాట్సప్‌ గ్రూపును ఏర్పాటు చేయను న్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పోచ్చమ్మ గుడి నుంచి ఇకపై పాపికొండల యాత్ర సాగనుండగా రూ.1,250 టికెట్‌ ధర నిర్ణయించారు. ఇదే సమయంలో తెలంగాణలోని పర్యాటకులు భద్రాచలం మీదుగా వరరామచంద్రాపురం మండలంలోని పోచారం నుంచి పాపికొండలు వెళ్లేందుకు రూ.1,100 చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా పర్యాటకులు నేరుగా తమ సొంత వాహనాల్లో బోటు ప్రారంభమయ్యే ప్రాంతానికి చేరుకుంటే కేవలం రూ.900లే పర్యాటకుల నుంచి తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా బోటుకు లైసెన్సును పోర్టు అధికారులు ఇవ్వనుండగా రూటు మ్యాపు, లోతు అంచనా వివరాలను నీటిపారుదల శాఖ ఇవ్వనుంది. ఈ రెండింటితోపాటు ఏపీ పర్యాటక శాఖ అనుమతి సైతం తీసుకోవాల్సి ఉంటుంది. 

నిబంధనలు, మార్గదర్శకాలు మరింత కఠినతరం

ఏపీలో బోటు ప్రమాదం నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విహార యాత్ర సాగించే బోట్లపై కఠిన నిబంధనలు, మార్గదర్శకాలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో బోటులో పర్యాటకులు పాపికొండలకు వెళ్లాలంటే ముందుగా వారి పేరు, ఆధార్‌ నెంబరు, సెల్‌ నెంబరు ఏ ఊరు నుంచి వస్తున్నారు అనే వివరాలను తప్పక పొందుపరచాలి. అలాగే బోటు సామర్థ్యాన్ని బట్టి పర్యాటకులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు పర్యాటకుల నుంచి సేకరించిన అనంతరం కంట్రోల్‌ రూములో ఉండే రెవిన్యూ, పర్యాటక, పోలీసు శాఖ అధికారులకు బోటులో వెళ్లే వారి పూర్తి వివరాలు అందజేయాల్సి ఉంటుంది. వారు అనుమతి ఇచ్చిన అనంతరం ఫెర్రీ పాయింట్‌ నుంచి బోటు కదులుతుంది.. ఇదిలా ఉండగా మద్యం తాగేందుకు బోటులో ఎంత మాత్రం అనుమతించరు. ఒక వేళ నిబంధనలను నిర్లక్ష్యం చేసి ఎవరైనా మద్యం సేవిస్తే సంబంధిత పర్యాటకుడ్ని అరెస్టు చేయడంతోపాటు సంబంధిత బోటును సీజ్‌ చేయనున్నారు. నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువగా ఎక్కిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నారు. అలాగే ఇకపై విహారయాత్ర సాగే సమయంలో బోటుపై నృత్యాలు చేయడం నిషేధం. 

బోటులో ఇవి తప్పక ఉండాల్సిందే.. 

బోటు ప్రారంభమయ్యే సమయంలో అనుమతిచ్చిన ప్రతీ ఒక్కరు పోర్టు నిబంధనల మేరకు ఆ సామర్ధ్యం కలిగిన లైఫ్‌ జాకెట్‌ను ధరించాలి. అలాగే ప్రయాణికులను రక్షించేందుకు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలి. వీటితో పాటు బోయెంట్‌ పరికరం 20మందికి ఒకటి చొప్పున, బోయాస్‌ ఆపరేటర్‌ 10మందికి ఒకటి చొప్పున పరికరాలు తప్పనిసరిగా లాంచీలో ఉండాలి. అలాగే ఆరు అగ్ని ప్రమాద నిరోధక యంత్రాలు సైతం ఉండాలి. ఇదిలా ఉండగా బోటు నిర్వాహకులు ఇచ్చిన లైఫ్‌ జాకెట్‌ను వేసుకోకపోయినా, తిరస్కరించినా వారిని బోటులోనికి అనుమతించరు. ఒక వేళ మధ్యలో ఎవరైనా తీసివేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-10-29T06:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising