ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీవ్‌ స్వగృహపై సమగ్ర నివేదిక ఇవ్వండి

ABN, First Publish Date - 2021-10-29T05:40:02+05:30

మండల పరిధిలోని పోలేపల్లి రెవిన్యూలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న రాజీవ్‌ స్వగృహపై పూర్తి నివేదక ఇవ్వాలని కలెక్టర్‌ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు.

రాజీవ్‌ స్వగృహను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కలెక్టర్‌ గౌతమ్‌

 ఇళ్ల సముదాయం పరిశీలన

ఖమ్మంరూరల్‌, అక్టోబరు28: మండల పరిధిలోని పోలేపల్లి రెవిన్యూలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న రాజీవ్‌ స్వగృహపై పూర్తి నివేదక ఇవ్వాలని కలెక్టర్‌ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఖమ్మం కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆదర్శ సురభితో కలిసి ఇళ్ల సముదాయాన్ని పరిశీలించారు. ప్రభుత్వం వీటి నిర్మాణం ఎప్పుడు ప్రారంభించింది, దాని బడ్జెట్‌ ఎంత, ఎంతవరకు నిర్మాణాలు పూర్తి అయ్యాయి ఇంకా ఏయే పనులు చేపట్టాల్సి ఉందని ఆరా తీశారు. ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తం బడ్జెట్‌ ఎంత ఎంత వరకు ఖర్చు చేశారు. ఇంకా ఎంత ఖర్చు చేయాల్సి ఉందని అధికారులను ప్రశించారు. ప్రాజెక్టు మధ్యలో ఎందుకు ఆగిపోయింది. కొనుగోలు దారులు ఎందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఇళ్ల సముదాయాన్ని పూర్తిచేసి విక్రయించే అవకాశం ఉందా అని అదికారులను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్తీ ఇలా వృథాగా ఉండటం ఏమిటని ఇన్ని రోజుల అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌తో అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  సమగ్ర వివరాలతో తనకు నివేదికను వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు వృఽథా కాకూడదని వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో శిరీష, ఆర్డీవో రవీంద్రనాద్‌, డిప్యూటీ తహసీల్దార్‌ కరుణశ్రీ, ఆర్‌ఐలు నరేశ్‌, ప్రవీణ్‌, గుత్తేదారు గరికపాలి వెంకటేశ్వర్లు, హౌజింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:40:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising