ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మగ్లర్లు భయపడాలి

ABN, First Publish Date - 2021-07-27T04:46:55+05:30

సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి, నిషేధిత వస్తువులను భద్రాద్రి దాటించాలంటే స్మగ్లర్లు భయపడే విధంగా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు భద్రాచలం ఏఎస్పీ డాక్టర్‌ వినీత్‌ తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ డాక్టర్‌ వినీత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిత్యం సరిహద్దుల్లో తనిఖీలు

కార్లలో తరలిస్తున్న 214కిలోల గంజాయి సీజ్‌

వివరాలు వెల్లడించిన భద్రాచలం ఏఎస్పీ డాక్టర్‌ వినీత్‌

భద్రాచలం టౌన్‌, జూలై 26: సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి, నిషేధిత వస్తువులను భద్రాద్రి దాటించాలంటే స్మగ్లర్లు భయపడే విధంగా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు భద్రాచలం ఏఎస్పీ డాక్టర్‌ వినీత్‌ తెలిపారు. ఆదివారం రాత్రి భద్రాద్రి పోలీసులకు పట్టుబడిన గంజాయికి సంబంధించిన వివరాలను సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం నుంచి బెంగళూరు, హైదరాబాద్‌కు రెండు కార్లల్లో తరలిస్తున్న 214కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి తరలిస్తున్న సంగారెడ్డి, కర్ణాటకకు చెందిన సర్దార్‌ రాథోడ్‌, అంజిత్‌, నాగ సుందర్‌, ఉమేష్‌, కామరాజు మునియప్పలను అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసిన్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.42.8లక్షలు ఉంటుందన్నారు. లాక్‌డౌన్‌ సడలించిన తరువాత ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భారీగా గంజాయిను తరలించేందుకు స్మగ్లర్లు అనేక విధాలుగా ప్రత్నిస్తున్నారని, వారు ఎన్ని ఎత్తులు వేసినా భద్రాద్రి పోలీసులు గంజాయి భద్రాద్రి దాటకుండా అడ్డుకట్ట వేస్తున్నారని వివరించారు. సరిహద్దు చెక్‌ పోస్టులలో నిత్యం పోలీసులు తనిఖీలు జరుగుతుంటాయని, గంజాయి, నిషేధిత వస్తువులను తరలించే వారిపై చట్టరీల్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో పట్టణ ఎస్‌ఐ మధుప్రసాద్‌, టైయినీ ఎస్‌ఐ రంజిత్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-07-27T04:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising