ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాచలంలో 200 కేజీల గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-06-08T04:41:11+05:30

భద్రాచలంలో సోమవారం ఒడిశా నుంచి నల్లగొండ జిల్లా మిర్యాలగూ డకు తరలిస్తున్న రూ.30 లక్షల విలువైన 200 కేజీల గంజాయిని భద్రాచలం పోలీసులు ప ట్టుకున్నారు.

పోలీసుల అదుపులో నిందితులు, సీజ్‌ చేసిన గంజాయి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం, జూన్‌ 7: భద్రాచలంలో సోమవారం ఒడిశా నుంచి నల్లగొండ జిల్లా మిర్యాలగూ డకు తరలిస్తున్న రూ.30 లక్షల విలువైన 200 కేజీల గంజాయిని భద్రాచలం పోలీసులు ప ట్టుకున్నారు. ఏఎస్‌పీ డాక్టర్‌ జి. వినీత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం సీఐ టి.స్వామి, ఎస్‌ఐ ఎం.సిల్వారాజు కూనవరం రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో ఇద్దరు వ్యక్తులకు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో వారి వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. కారులో మొత్తం 200 కేజీల గంజాయి లభించింది. దీని విలు వ రూ.30 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితులను విచారించి వారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం నందిపాడుకు చెందిన రూపావత్‌ రవి, దరావత్‌ శంకర్‌గా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్‌పీ వినీత్‌ మాట్లాడుతూ భద్రాచలం పట్టణ సరిహద్దుల్లో 24 గంటలు పోలీసుల తనిఖీలు జరుగుతుంటాయని, నిషేధిత వస్తువులైను తరలిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పట్టణ సీఐ టి.స్వామి, ఏఎస్‌ఐ శేషగిరి పాల్గొన్నారు.


Updated Date - 2021-06-08T04:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising