ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.44.85 లక్షల గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-04-13T05:40:50+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగులో రూ.44.85లక్షల విలువ చేసే గంజాయిని సోమవారం అశ్వాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు వెల్లడిస్తున్న మణుగూరు ఏఎస్పీ శబరీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అశ్వాపురం, ఏప్రిల్‌12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగులో రూ.44.85లక్షల విలువ చేసే గంజాయిని సోమవారం అశ్వాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణుగూరు ఏఎస్పీ శబరీష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మల్లెలమడుగు ఎస్సీ కాలనీలో దాసరి రాము ఇంట్లో పెద్ద మొత్తంలో గంజాయి నిల్వ ఉంచాడు. విశ్వసనీయ సమాచారంతో అశ్వాపురం సీఐ సాట్ల రాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేశారు.   136 గంజాయి ప్యాకెట్లు సుమారుగా 2క్వింటాళ్ల 99కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.44.85లక్షలు ఉంటుందన్నారు. ఇంటి యజమాని పరారీలో ఉన్నాడని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు. ఈ సమావేశంలో సిఐ సాట్ల రాజు,సిబ్బంది మంగీలాల్‌, భద్రులు పాల్గొన్నారు. వీఆర్‌ఓ వరలక్ష్మి పంచనామా నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-04-13T05:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising